Bone Soup: వేడి వేడిగా ఈ నాన్ వెజ్ సూప్ తాగితే మీకు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ల నొప్పులు తగ్గడం ఖాయం..

Bone Soup: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయో వారికి బోన్ సూప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి బోన్ సూప్ తాగితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.

Update: 2024-09-06 05:42 GMT

Bone Soup

Bone Soup: సాధారణంగా వయసు పెరిగే వారిలో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కాల్షియం లోపం అలాగే ఇతర పోషక పదార్థాల లోపం వల్ల కీళ్లు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారికి బోన్ సూప్ ఒక రకంగా పరిష్కారమనే చెప్పవచ్చు. బోన్ సూప్ తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఆరోగ్యకరమైన పదార్థాలు లభిస్తాయి. అంతేకాదు బోన్ సూప్ చాలా రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు సైతం బోన్ సూప్ తాగమని సూచిస్తూ ఉంటారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతోపాటు ఇది తేలికగా అరుగుతుంది. ప్రధానంగా బరువు తగ్గే వారికి కూడా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక ఎవరికైతే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయో వారికి బోన్ సూప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి బోన్ సూప్ తాగితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఈ బోన్ సూప్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం. మేక, గొర్రె, కోడి వంటి జంతువుల కాళ్ళను ప్రత్యేకంగా ఉడకబెట్టి ఈ బోన్స్ తయారు చేస్తారు, దీనిని పాయ సూప్, మటన్ మరగ్ అని కూడా అంటారు. బోన్ సూప్ తాగినట్లయితే మీ శరీరానికి కొల్లాజెన్ అనే మూలకం అధికంగా లభిస్తుంది. దీనివల్ల మీ శరీరం అకాల వృద్ధాప్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. దీంతో పాటు మీ చర్మం కూడా బిగుతు కోల్పోకుండా ఉంటాయి. మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా బయటపడే అవకాశం లభిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు బోన్ సూప్ తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా ఒక పని చేసే వ్యక్తి రోజుకు 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బోన్ సూప్ తాగడం వల్ల ఈ ప్రోటీన్ లను మీరు పొందవచ్చు. సాధారణంగా చికెన్ మటన్ తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు ఉన్నప్పటికీ కొవ్వు వల్ల ఎక్కువగా తినలేరు. కానీ బోన్ సూప్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గేవారికి ప్రోటీన్ అందించే ఆహారంగా బోన్ సూప్ భావించవచ్చు.

బోన్ సూప్ లో కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో కొలాజిన్, గ్లూటామైన్, గ్లాసిన్ అనే సమ్మేళనాలు కూడా లభిస్తాయి. బోన్ సూప్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News