Egg: గుడ్డు తింటే బరువు పెరుగుతారా.? ఇందులో నిజమెంత..!

అయతే కోడి గుడ్డు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న దాంట్లో నిజం ఉన్నట్లే, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.

Update: 2024-09-04 10:00 GMT

Egg: గుడ్డు తింటే బరువు పెరుగుతారా.? ఇందులో నిజమెంత.. 

Egg: ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తీసుకునే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు ఒకటి. వారంలో రెండుసార్లైనా గుడ్డును తింటుంటారు. చివరికి నాన్‌ వెజ్‌ తీసుకొని వారు కూడా కోడి గుడ్లను తింటారు. వైద్యులు సైతం ప్రతీ రోజూ ఒక కొడి గుడ్డు తినాలని సూచిస్తుంటారు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చిన్నారులు మొదలు, గర్భిణీల వరకు ప్రతీ ఒక్కరినీ కోడి గుడ్డును తీసుకోవాలని చెబుతుంటారు. అయతే కోడి గుడ్డు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న దాంట్లో నిజం ఉన్నట్లే, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మనలో చాలా మందికి కోడిగుడ్డుకు సంబంధించి కొన్ని అపోహలు ఉంటాయి.? ఇంతకీ ఏంటా అపోహలు.? వాటిలో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* కోడి గుడ్డు లోపల పచ్చ సొన తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడానికి, కోడిగుడ్డు తీసుకోవడానికి మధ్య ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. కోడి గుడ్డు సొనలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

* ఇక కోడి గుడ్డు తినడం వల్ల మొటిమలు కూడా వస్తాయని కొందరు భావిస్తుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టిన కోడి గుడ్డును తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయని భావిస్తారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కోడి గుడ్లు తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుందని అంటున్నారు. చర్మం మృదువుగా మారడానికి కావాల్సిన పోషకాలు కోడి గుడ్డులో లభిస్తాయి.

* మనలో కొందరు కోడి గుడ్లను కడుగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్లపై ఉండే సాల్మోనిలా అనే బ్యాక్టీరియా.. గుడ్డును కడిగినప్పుడు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కోడిగుడ్లను కడగడం మంచిది కాదని సూచిస్తున్నారు.

* బ్రౌన్‌ కలర్‌లో ఉండే గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని కొందరు భావిస్తుంటారు. ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. గుడ్డు ఏ రంగులో ఉన్నా అందులో ఉండే పోషకాలు మాత్రం ఒకేలా ఉంటాయని అంటున్నారు.

* కోడి గుడ్డును తీసుకోవడం వల్ల వేడి చేస్తుందనే భావన కూడా ఉంటుంది. అయితే ఇందులో కూడా పూర్తి స్థాయిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇటర్నెట్‌తో పాటు పలువురు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించిన సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News