Children Snore : పిల్లలు రాత్రి నిద్రలో గురకపెడుతున్నారా.. అయితే ఈ జబ్బు ఉండే చాన్స్
Children Snore :మీ పిల్లలు రాత్రివేళ నిద్ర పోయినప్పుడు గురక పెడుతున్నారా.. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా తలనొప్పి లేస్తుందని బాధపడుతున్నారా అయితే సైనస్ విభాగంలోని ఎడినాయిడ్స్ సమస్య అయ్యే అవకాశం ఉంది.
Children Snore : మీ పిల్లలు రాత్రివేళ నిద్ర పోయినప్పుడు గురక పెడుతున్నారా.. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా తలనొప్పి లేస్తుందని బాధపడుతున్నారా అయితే సైనస్ విభాగంలోని ఎడినాయిడ్స్ సమస్య అయ్యే అవకాశం ఉంది.
ఎడినాయిడ్స్ అనేవి గొంతులో ఉండే ఒక రక్షణ వ్యవస్థ. ఇవి ఒక్కోసారి ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పుడు తరచూ గొంతులో నొప్పి లేస్తుంది లేదా తలపోటు వస్తుంది. ఈ సమస్య పెద్దల్లో కన్నా చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య పిల్లలను చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వారిని చికాకు పెట్టడం వల్ల చదువు మీద కూడా ఆసక్తి తగ్గుతుంది. పిల్లలు సమస్యను ఎక్కువగా తమ పెద్దలకు వర్ణించలేరు.
ఇందులో లక్షణాలను చూసినట్లయితే, తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. చెవిపోటు వస్తుంది అలాగే ముక్కు లోపల చిరాకుగా ఉంటుంది. మీరు గుర్తించిన వెంటనే ఈ ఎన్ టి నిపుణులను కలిసి చికిత్స ప్రారంభిస్తే మంచిది. లేకపోతే ఇన్ఫెక్షన్ ముదిరే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎడినాయిడ్స్ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో సైజు పెరుగుతాయి. ఆ తర్వాత 12 నుంచి 13 వేల సంవత్సరాలకు ఇవి పూర్తిగా తగ్గిపోతాయి.
యుక్త వయసు వచ్చిన పిల్లల్లో ఈ సమస్య పెద్దగా కనిపించదు. కానీ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో మాత్రం ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఇది గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది.
ఇది సాధారణంగా స్ట్రెప్టో కోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఇతర శరీర భాగాలకు సైతం వ్యాపించే అవకాశం ఉంది. కొంతమందిలో జ్వరం కూడా రావచ్చు. ఈ ఎడినోయిడ్ గ్రంథి వాపు వల్ల ముక్కు నుంచి చెవి మధ్యలో ఉండే నాళం మూసుకుపోతుంది. తద్వారా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే మళ్ళీ చెవులు యధా స్థానంలోకి వస్తాయి.
అలాగే ఈ ఎడినాయిడ్స్ సమస్య వల్ల పిల్లలకు ఎగుడు దిగుడు పళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో ఈ ఎడినాయిడ్స్ ను శస్త్ర చికిత్స చేయడం ద్వారా తొలగిస్తారు. అయితే సమస్య ముదరకముందే డాక్టర్ ను సంప్రదిస్తే మందులతోనే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంట్లో పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అని ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తున్నారా అయితే పిల్లలు తరచుగా నిద్ర పోయినప్పుడు పెద్దగా గురక పెట్టడం, వినికిడి సమస్యతో ఇబ్బంది పడటం వంటివి గుర్తించాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు తరచూ నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.
అలాగే జలుబు చేసినప్పుడు తరచూ జ్వరం బారిన పడుతూ ఉంటారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు ఈ ఎన్ టి నిపుణుడిని కలవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.