Saving Schemes: బ్యాంక్‌ ఎఫ్‌డీ కంటే ఎక్కువ ఆదాయం.. బెస్ట్ పథకాలు ఇవే..

Saving Schemes: కానీ ఎలాంటి నష్టం లేకుండా కచ్చితంగా రిటర్న్స్‌ పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే బెస్ట్‌ ఆప్షన్‌

Update: 2024-06-23 09:55 GMT

Saving Schemes: బ్యాంక్‌ ఎఫ్‌డీ కంటే ఎక్కువ ఆదాయం.. బెస్ట్ పథకాలు ఇవే.. 

Saving Schemes: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా పొదుపు చేస్తుంటారు. అయితే దాచి పెట్టిన సొమ్మును ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. కొందరు ల్యాండ్‌లో పెట్టుబడి పెడితే మరికొందరు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు.

అయితే ఇవి కాస్త రిస్క్‌తో కూడుకున్న అంశాలు. మనం పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్‌ వస్తుండొచ్చు, నష్టపోతుండొచ్చు. కానీ ఎలాంటి నష్టం లేకుండా కచ్చితంగా రిటర్న్స్‌ పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే బెస్ట్‌ ఆప్షన్‌. ఈ రకంగా చాలా మంది బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బ్యాంకుల్లో తక్కువ వడ్డీ వస్తుందని తెలిసిందే. అలా కాకుండా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ లభించే వాటిలో పోస్టాఫీస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరి బ్యాంక్‌ ఎఫడీ కంటే ఎక్కువ ఆదాయం అందిచే కొన్ని పోస్టాఫీస్‌ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం పొందే పథకాల్లో పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1,500, గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ జాయింట్ ఖతాను తెరిస్తే గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారులు 7.4 శాతం వడ్డీని పొందొచ్చు.

* పోస్టాఫీస్‌ అందిస్తోన్న మరో బెస్ట్‌ స్కీమ్‌లో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. కిసాన్‌ వికాస్‌ పత్రలో పెట్టుబడిదారులు సంవత్సరానికి 7.5 శాతం చక్రవడ్డీని పొందుతారు. పెట్టుబడి మొత్తం 115 నెలలు లేదా 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.

* బ్యాంకు ఎఫ్‌డీతో పోల్చితే మరో బెస్ట్ పెట్టుబడి పథకంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒకటి. ఇందులో వ్యక్తి ఆదాయ స్లాబ్ ఆధారంగా పన్ను మినహాయింపు అందిస్తారు. అలాగే ఇందులో పెట్టిన పెట్టుబడికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

Tags:    

Similar News