Summer: వేసవి మొదలైంది.. ఈ ఆహారాలని డైట్‌లో చేర్చాల్సిందే..!
Summer: చలికాలం ముగుస్తుంది. వేసివి కాలం ప్రారంభంకాబోతుంది. మరోవైపు పగటిపూట ఎండలు జోరందుకున్నాయి.
Summer: చలికాలం ముగుస్తుంది. వేసివి కాలం ప్రారంభంకాబోతుంది. మరోవైపు పగటిపూట ఎండలు జోరందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ వేడి వల్ల ప్రజలకు చెమటలు పట్టడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో మీరు మీ ఆహార శైలిని మార్చడం అవసరం. వేసవిలో డీహైడ్రేషన్, స్కిన్ సెన్సిటివిటీ, విటమిన్స్ వంటి మినరల్స్ లోపం వంటి సమస్యలు మొదలవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి మీ ఆహారంలో జ్యుసి పండ్లు, కూరగాయలు,పెరుగు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోండి. వేసవిలో ఏ ఆహార పదార్థాలు తింటే ఫిట్‌గా ఉండవచ్చో తెలుసుకుందాం.
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే పెరుగు వేసవిలో ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్ మీ ఆకలిని దూరం చేస్తుంది. ఉప్పు, అధిక కేలరీల స్నాక్స్ తినకుండా నిరోధిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోబయోటిక్స్, సహాయక బ్యాక్టీరియాను కూడా అందిస్తుంది. వేసవిలో గొంతు తరచుగా పొడిగా, దాహంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నిమ్మరసంతో ఫిల్టర్ చేసిన పుదీనా జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది మీ జీవక్రియను బలంగా చేస్తుంది.
పుచ్చకాయ ఉత్తమ వేసవి పండు. ఇది మీ పొట్టను చల్లగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. నీరు సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మ కణాలను ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది. నారింజలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. వేసవి ఆహారంలో ఈ పోషకం చాలా విలువైనది. ఇందులో 80 శాతం నీరు ఉంటుంది ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది.