Health Tips: ఈ 3 కూరగాయలు పచ్చిగా తింటే బెస్ట్‌.. ఉడికించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం..!

Health Tips: కొన్ని కూరగాయలు పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్నింటిని ఉడికించి తినడం వల్ల లాభాలు ఉంటాయి.

Update: 2023-10-20 10:30 GMT

Health Tips: ఈ 3 కూరగాయలు పచ్చిగా తింటే బెస్ట్‌.. ఉడికించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం..!

Health Tips: కొన్ని కూరగాయలు పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్నింటిని ఉడికించి తినడం వల్ల లాభాలు ఉంటాయి. వేటిని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. కానీ మార్చి తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వండిన ఆహారాల కంటే కొన్ని పచ్చి ఆహార పదార్థాలే ఎక్కువ లాభాలను కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి మేలు చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రోజు అలాంటి మూడు ఆహారాల గురించి తెలుసుకుందాం.

క్యారెట్లు

క్యారెట్లలో కార్బోహైడ్రేట్, ఫైబర్, విటమిన్ ఎ, కె, సి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్లను ఉడికించి తినడం కంటే పచ్చిగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చి క్యారెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్లు, చర్మం, పొట్టకు సంబంధించిన సమస్యలను నయం చేస్తాయి.

బీట్‌రూట్

హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. దీన్ని తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీట్‌రూట్‌ను సలాడ్‌గా కాకుండా పచ్చిగా కూడా తినవచ్చు. కావాలంటే దీని రసాన్ని తాగవచ్చు. బీట్‌రూట్ గుండె జబ్బులు, క్యాన్సర్, కాలేయం వంటి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

టొమాటో

టొమాటోలో విటమిన్ ఎ, సి, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయ రుచిని మార్చే టొమాటోను పచ్చిగా కూడా తింటారు. యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న టొమాటో మధుమేహం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇక నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు పచ్చి కూరగాయలను తినడం ప్రారంభించండి.

Tags:    

Similar News