Health: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.. అవేంటంటే..?

Health: పేగులు చేసే పని మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం. శరీరంలోని మిగిలిన చెడు పదార్థాలను తొలగించే పనిని కూడా చేస్తుంది.

Update: 2022-02-26 11:00 GMT

Health: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.. అవేంటంటే..?

Health: పేగులు చేసే పని మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం. శరీరంలోని మిగిలిన చెడు పదార్థాలను తొలగించే పనిని కూడా చేస్తుంది. పేగులు మన మొత్తం శరీరానికి పోషకాలను చేరవేస్తాయి. కానీ అవి సరిగ్గా పనిచేయాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. మన జీర్ణక్రియలో చిన్న పేగు, పెద్ద పేగు రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేగులో ఏదైనా సమస్య తలెత్తితే ముందుగా మన జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా తయారవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ లేదా ఇతర రకాల సమస్యలు శరీరాన్ని చుట్టుముడతాయి. అందుకే పేగులని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

అన్నం శరీరం లోపల గ్లైకోజెన్‌గా మారుతుంది కొంత సమయానికి అది గ్లూకోజ్‌గా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం లోపల స్థిరపడి కొవ్వు రూపంలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా ఊబకాయం బారిన పడుతారు. అయితే యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC)లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం అన్నం వండేటప్పుడు ఒక నిర్దిష్ట పద్దతిని అనుసరిస్తే కేలరీలు చాలా రెట్లు తగ్గుతాయని చెప్పారు.

యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకుల ప్రకారం.. బియ్యంలో కేలరీలను తగ్గించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం కుక్కర్‌లో వండడానికి బదులుగా ఓపెన్ పాత్రలో వండాల్సి ఉంటుంది. నీరు మరిగించేటప్పుడు ఒక చెంచా కొబ్బరి నూనె వేసి ఆపై ఆ నీటిలో బియ్యం వేయాలి. సుమారు 25 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అదనపు నీటిని తీసివేసి రిఫ్రిజిరేటర్‌లో 12 గంటలు చల్లబరచాలి. అప్పుడు అన్నంలో పిండిపదార్థాలు తగ్గి నీటిశాతం పెరుగుతుంది.

Tags:    

Similar News