Health Tips: వీటిని పచ్చిగా తింటే చాలా ప్రయోజనాలు.. వండటం వల్ల ఫలితం శూన్యం..!
Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి.
Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. కానీ కొన్ని కూరగాయలని వండటం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ఇటువంటి వాటిని తినడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అందుకే వాటిని పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పచ్చికూరగాయలని తినడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం.
ఉల్లిపాయ
ఉల్లి అనేది ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. వెజిటబుల్ గ్రేవీ తయారీలో ఉల్లిపాయను అధికంగా వాడుతారు. అయితే పచ్చి ఉల్లిపాయను సలాడ్ రూపంలో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని పచ్చిగా తింటే అధిక ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చి బీట్‌రూట్ తినడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరం శక్తితో నిండి ఉంటుంది.
టొమాటో
టమోటాలని అన్ని కూరలలో వాడుతారు. కానీ నిజంగా టమోటాలోని పోషకాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానిని సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే టొమాటో వండిన తర్వాత అందులోని పోషకాలు నశిస్తాయి. అందుకే పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
బ్రోకలీ
బ్రోకలీ ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. దీనిని సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల అధిక మేలు జరుగుతుంది. కానీ దీన్ని ఉడికించాలంటే కొంచెం ఉప్పు మాత్రమే వాడాలి. దీనిని కచ్చితంగా పచ్చిగా తినడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది.