Heart Attack: చలికాలం గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. ఇలా నివారించండి..!
Heart Attack: దేశంలోని అనేక రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి.
Heart Attack: దేశంలోని అనేక రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. నిరంతరం పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. చలి పెరిగినప్పుడు హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా గుండెపోటుకు గురవుతారు. ఈ సీజన్‌లో గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
చలి కారణంగా గుండె సిరలు కుంచించుకుపోయి రక్త సరఫరా సరిగ్గా జరగదు. అధిక బీపీ కారణంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వెన్ను, ఎడమ చేయి నొప్పి, పాదాల్లో వాపు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉదయం వాకింగ్ చేయకుండా ఉండటమే మంచిది. ఇటీవల కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారు గుండె పరీక్షలన్నీ చేయించుకోవాలి.
ఆహారంలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించాలి.
ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడవద్దు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫైబర్ మొత్తాన్ని పెంచాలి. ఇప్పటికే హార్ట్ పేషెంట్ అయితే మందులను క్రమం తప్పకుండా వాడాలి. తరచూ బీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. పగటిపూట సూర్యరశ్మిలో తిరగాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. గత కొన్ని నెలలుగా గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వైరస్ కూడా పెద్ద కారణం. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.