Heart Attack In Winter: చలికాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. ఈ పొరపాట్లు చేయవద్దు..!
Heart Attack In Winter: చలికాలంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఉదయం 4 నుంచి 10 గంటల మధ్య గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
Heart Attack In Winter: చలికాలంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఉదయం 4 నుంచి 10 గంటల మధ్య గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో ఎపినెఫ్రిన్, కార్టిసాల్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. ఆక్సిజన్ కోసం డిమాండ్ పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. బీపీ పెరగడం, ఆక్సిజన్ ఎక్కువ డిమాండ్ కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. హార్ట్ఎటాక్ వస్తుంది.
చలికాలంలో అధిక రక్తపోటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికి శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గుండె సిరల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాలి. ఇలా ఒత్తిడి పెరగడం వల్ల గుండెపోటు వస్తుంది.
ఈ తప్పులు చేయవద్దు
1. విపరీతమైన చలిలో వాకింగ్ చేయకూడదు
2. అధికంగా వ్యాయామం చేయకూడదు
3. బీపీని చెక్ చేయకపోవడం
4. చక్కెర ఎక్కువగా తినడం
5. వీధి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం
గుండెపోటు ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
పూర్తి నిద్ర పోవాలి: రోజులో తొమ్మిది గంటలు నిద్రించాలి. మంచి నిద్ర గుండెను ఫిట్‌గా ఉంచుతుంది.
గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలి: ఉదయం పూట నడక ప్రారంభించండి. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
అల్పాహారం: ఉదయం టిఫిన్ మానేయవద్దు. ఇది గుండెకు చాలా ముఖ్యం.
ధూమపానం, మద్యపానం మానుకోండి: ధూమపానం, మద్యపానం గుండెకు హానికరం. వాటిని తీసుకోవడం మానుకోండి.
ధ్యానం: ఉదయం పూట చేసే ధ్యానం గుండెకు మేలు చేస్తుంది. ఇది శాంతి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పరీక్షించుకోండి: డాక్టర్ సలహా మేరకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష, ఇతర పరీక్షలను చేయించకోండి.