Figs Benefits: అత్తి పండ్లలోని అద్భుత ఔషధ గుణాలు.. ఈ సమస్యలకి మంచి మందు..!
Figs Benefits: అత్తి పండ్లలోని అద్భుత ఔషధ గుణాలు.. ఈ సమస్యలకి మంచి మందు..!
Figs Benefits: అంజీర్ కేవలం పండు మాత్రమే కాదు.. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ అంజీర పండ్లను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఎండు అత్తి పండ్లను పాలలో కలిపి తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అత్తి పండ్లను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా భావిస్తారు. బరువు తగ్గాలనుకున్నా లేదా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలనుకున్నా అత్తిపండ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అత్తి పండ్లలోని ఔషధ గుణాలు
అత్తి పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు ఉంటాయి. దీంతో పాటు అత్తి పండ్లను ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు (A, B కాంప్లెక్స్) మంచి మూలం. ఇందులో ట్రిప్టోఫాన్, మెలటోనిన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
ప్రయోజనాలు
అత్తి పండ్లలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం లోపం సమస్యతో బాధపడుతుంటే దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. కాల్షియం ఎముకలు, దంతాలకు అవసరమైన మూలకం. ఐరన్ లోపం ఉన్నవారు ఎండిన అత్తి పండ్లను తినాలి. ఇది రక్తహీనత వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా అజీర్ణం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే అత్తి పండ్లను తీసుకోవాలి.