Sapota: చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు..!

Sapota: సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2023-12-28 14:00 GMT

Sapota: చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు..!

Sapota: సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఈ కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి. సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.

జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట. ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట. నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిదట. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోట మంచిది.

అంతేకాదు సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్న సపోటాలను మహిళలు గర్భధారణ సమయం లో తింటే మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య వున్నవారికి ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. సపోటా తినడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

Tags:    

Similar News