Health Tips: చలికాలం స్వీట్ పొటాటోస్ తప్పక తినాలి.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు..!

* స్వీట్ పొటాటోస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

Update: 2022-11-14 06:26 GMT

చలికాలం స్వీట్ పొటాటోస్ తప్పక తినాలి.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు

Health Tips: స్వీట్ పొటాటోస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఇవి మార్కెట్‌లో విరివిగా లభిస్తాయి. చిలగడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, విటమిన్ సి మొదలైన పోషకాలు ఉంటాయి. చిలకడదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. చిలగడదుంపను ఉడకబెట్టి చాట్‌గా చేసుకుని తినవచ్చు. చిలగడదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది..

చిలగడదుంపలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. స్వీట్ పొటాటోస్ తినడం వల్ల పొట్టలో గ్యాస్, మలబద్దకం సమస్య ఉండదు. చాట్ చేసేటప్పుడు అందులో నిమ్మకాయను తప్పనిసరిగా వాడాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్య దూరమవుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

చిలగడదుంప తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం అలసట, బలహీనతను నయం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిలగడదుంప శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది..

చిలగడదుంపలు తినడం వల్ల కళ్లు చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కంటిచూపు పెరగడంతో పాటు కళ్లను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది. చిలకడదుంప తినడం వల్ల కంటి జబ్బులు తగ్గుతాయి.

బరువు తగ్గుతారు..

చిలగడదుంపు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు వల్ల చాలా సమయం పొట్ట నిండుగా ఉన్న భావనని కలిగిస్తుంది. దీని వల్ల మీకు ఆకలి అనిపించదు. బరువు అదుపులో ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News