Health News: కళ్ల కింద గుంతలు పడుతున్నాయా.. కారణాలు తెలుసుకోండి..!
Health News: ఎవరైనా సరే కళ్లు అందంగా ఉంటే మరింత అందంగా కనిపిస్తారు...
Health News: ఎవరైనా సరే కళ్లు అందంగా ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. అయితే కొందరికి కళ్ల కింద గుంతలు ఏర్పడుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. సాధారణంగా చెడ్డ జీవనశైలి, శరీరంలో నీటి కొరత కారణంగా ఇది జరుగుతుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
వృద్ధాప్యం వల్ల కళ్ల కింద గుంతలు పడటం మొదలవుతుంది. వాస్తవానికి వృద్ధాప్యం వల్ల చర్మంలో కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా కళ్ళ చుట్టూ ఉన్న చర్మం పగిలిపోతుంది. దీని వల్ల చర్మం వదులుగా మారి కళ్ల కింద గుంతలు ఏర్పడటం మొదలవుతుంది. చాలా సార్లు నిద్ర లేకపోవడం వల్ల మీ కళ్ళ కింద గుంతలు పడుతాయి. వాస్తవానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల చర్మం బలహీనంగా మారుతుంది.
అలాగే మీ శరీరంలో విటమిన్-కె తక్కువగా ఉంటే మీ కళ్ల కింద గుంతలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో విటమిన్ లోపాన్ని అధిగమించడానికి మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ కళ్ల కింద గుంతలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో మీరు నీరు ఎక్కువగా తాగాలి. UV కిరణాలు, కాలుష్యం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. వీటిని నివారించడానికి, బయటికి వెళ్లే టప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.