Pulses: నెల రోజులు పప్పు తినడం మానేయండి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Pulses: భారతదేశంలో పప్పులపై ఆధారపడి బతికే కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి. వీరికి ఒక్క రోజు పప్పు లేకపోయినా రోజు గడవదు. తక్కువ ధరలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే ఏకైక ఆహారం పప్పు మాత్రమే.

Update: 2024-06-03 01:30 GMT

Pulses: నెల రోజులు పప్పు తినడం మానేయండి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Pulses: భారతదేశంలో పప్పులపై ఆధారపడి బతికే కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి. వీరికి ఒక్క రోజు పప్పు లేకపోయినా రోజు గడవదు. తక్కువ ధరలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే ఏకైక ఆహారం పప్పు మాత్రమే. వారంలో కనీసం ఒక్కరోజైనా పప్పుకూర తిననది ఉండరు. ఇక మాంసాహారం తినని వారికి ఇవి సూపర్ ఫుడ్ అని చెప్పాలి. పప్పుతో అన్నం తినడమంటే వీరికి మహాసరదా. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాంటి పప్పును ఒక నెల రోజులపాటు తీసుకోకుండా ఉంటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

పప్పులు నెల రోజుల పాటు తినకుండా ఉంటే బలహీనత వస్తుంది. కండరాల నొప్పి, తిమ్మిర్లు కలుగుతాయి. ఎముకలు బలహీనంగా మారుతాయి. శరీరానికి కావాల్సిన ఫైబర్ అందక మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతాయి. బాడీ వీక్గా తయారవుతుంది. అందుకే ఏదో ఒక పప్పును ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రతిరోజు మటన్, చికెన్లు తినలేము కదా.. పప్పు శరీర అవసరాలన్నింటిని తీర్చుతుంది. కాబట్టి వైద్యులు కూడా ఇదే సూచిస్తారు.

పప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రోజూ పప్పుధాన్యాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. పప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థాల కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. పప్పుధాన్యాలలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు దృఢంగా చేస్తాయి. దీనివల్ల శక్తివంతంగా తయారవుతారు.

Tags:    

Similar News