Sprouts Side Effects: ఈ వ్యక్తులు మొలకెత్తిన గింజలు తినకూడదు..!

Sprouts Side Effects: ఈ వ్యక్తులు మొలకెత్తిన గింజలు తినకూడదు..!

Update: 2022-10-13 01:30 GMT

Sprouts Side Effects: ఈ వ్యక్తులు మొలకెత్తిన గింజలు తినకూడదు..!

Sprouts Side Effects: మొలకలలో ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, సి మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు. మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటిపి జీర్ణం చేయాలంటే శరీరం చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వల్ల చాలా సార్లు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

మొలకెత్తిన విత్తనాలని జీర్ణం చేయడానికి శరీరానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం సంభవిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మొలకలు తినడం చాలా హానికరం. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని లేదా బలహీనంగా ఉన్నవారు మొలకలను తక్కువగా తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మొలకలకి కొద్దిగా నూనె, అల్లం, కారం వేసి ఉడికించి తినాలి.

మొలకలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా సార్లు శరీరం అన్ని పోషకాలను గ్రహించలేకపోతుంది. దీని కారణంగా మొలకలను పచ్చిగా కాకుండా కొద్దిగా ఉడికించడం మంచిది. ఇలా చేయడం వల్ల అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఉదయం ఎక్సర్‌ సైజ్‌ చేసే యువకులు, జిమ్‌చేసే వారు మొలకలు తీసుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఎనర్జీ బాగా అవసరమవుతుంది.

Tags:    

Similar News