Health News: ఈ లక్షణాలు కనిపిస్తే అది పెద్దపేగు క్యాన్సర్.. సకాలంలో గుర్తించకుంటే చాలా ప్రమాదం..!
Health News: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి ప్రేగు క్యాన్సర్.
Health News: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి ప్రేగు క్యాన్సర్. ఇది పెద్దపేగులకి సోకుతుంది. దీనినే మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యులు అధిక ప్రమాదంలో ఉన్న లేదా 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం స్క్రీనింగ్‌ని సిఫార్సు చేస్తారు. ప్రేగు క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పటికీ అవి ఒక్కొక్కటిగా మారుతాయి.
అందువల్ల పెద్దపేగు క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం గుర్తించడం చాలా అవసరం. ప్రారంభ లక్షణాలు అతిసారం, మలబద్ధకం, విసర్జనలో సమస్యలు, టాయిలెట్ ఉపయోగించే ఫ్రీక్వెన్సీలో మార్పు, మూత్రంలో రక్తం కనిపించడం లాంటివి ఉంటాయి. వైద్యుల ప్రకారం మల రక్తస్రావం కొన్నిసార్లు ప్రేగు క్యాన్సర్ మొదటి అత్యంత గుర్తించదగిన లక్షణమని చెబుతారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద పేగు క్యాన్సర్‌కు ముఖ్యకారణంగా చెప్పవచ్చు. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఆలస్యం చేయకుండా కొలనోస్కోపీ చేయించాలి. పెద్దప్రేగు గోడ లోపల పరిమితంమైన క్యాన్సర్లను శస్త్రచికిత్సతో నయం చేయవచ్చు. కానీ విస్తృతంగా వ్యాపించిన క్యాన్సర్ సాధారణంగా నయం కాదు.