Ragi Laddu Benefits: రాగి లడ్డులు కీళ్లనొప్పులకి ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..!

RagiLaddu Benefits: రాగి అనేది గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులో కాల్షియం, ప్రొటీన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Update: 2023-02-06 11:30 GMT

Ragi Laddu Benefits: రాగి లడ్డులు కీళ్లనొప్పులకి ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..!

RagiLaddu Benefits: రాగి అనేది గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులో కాల్షియం, ప్రొటీన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. రాగులను తినడం వల్ల శరీరంలో రక్తపు లోపాన్ని తీర్చుతుంది. అయితే రాగులతో లడ్డూలు కూడా తయారుచేసుకొని తినవచ్చు. ఇవి రుచికరంగా, పోషకాహారాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కీళ్లనొప్పులకి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే ఇంట్లోనే రాగిలడ్డులని ఎలా తయారుచేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

రాగి పిండి 1/4 కప్పు

బెల్లం పొడి 1/4 కప్పు

నెయ్యి 1 టేబుల్ స్పూన్

కొబ్బరి 1/4 కప్పు వేయించిన

జీడిపప్పు 1 కప్పు తురిమిన

ఉప్పు చిటికెడు

ఎలా తయారు చేయాలి?

రాగి లడ్డూలు తయారుచేయడానికి ముందుగా రాగుల పిండిని తీసుకోవాలి. తర్వాత పాన్‌లో వేసి సుమారు 2-3 నిమిషాలు పొడిగా వేయించాలి. తరువాత దానికి చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్‌ చేయాలి. తరువాత అందులో తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. తర్వాత దానిని ఒక ప్లేట్‌లో తీసి చల్లబరచాలి. అందులో బెల్లం పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యకరమైన రాగి లడ్డూలు రెడీ అయ్యాయి.

Tags:    

Similar News