Health Tips: వయసును బట్టి ప్రొటీన్ అవసరం.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ప్రొటీన్ అవసరమవుతుంది. ప్రొటీన్ ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ప్రొటీన్ అవసరమవుతుంది. ప్రొటీన్ ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. శరీరంలో ప్రొటీన్ లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్ లోపం వల్ల ఊబకాయం, ఎముకలు బలహీనపడటం, జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలతో బాధపడుతారు. కానీ శరీరానికి వివిధ వయసులలో వివిధ రకాల ప్రొటీన్లు అవసరమవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. ఆకలిని నియంత్రించడం
ప్రొటీన్ ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. లెప్టిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
2. కండరాలు, ఎముకల నిర్మాణం
మన శరీరంలో ప్రోటీన్ ప్రధాన విధి బలమైన కండరాలు, ఎముకలను నిర్మించడం. ఇది శరీరంలో కొత్త ఎముకలు ఏర్పడటానికి సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల ప్రమాదం నుంచి రక్షిస్తుంది.
3. ఎముకల బలోపేతం
ఎముకలను నిర్మించడంతో పాటు, బలోపేతం చేయడానికి ప్రోటీన్ పనిచేస్తుంది. ఇది ఎముకలను గాయాల నుంచి రక్షిస్తుంది. పగుళ్లను నివారిస్తుంది.
4. జీవక్రియను మెరుగుపరుస్తుంది
ప్రోటీన్ మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
5. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
బరువు తగ్గడంలో ప్రోటీన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిపుణులు బరువు తగ్గడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది.
వృద్ధులకు ఎక్కువ ప్రోటీన్ అవసరం
శరీరంలో చర్మం, జుట్టు, గోళ్లు, కండరాలు, ఎముకలు, అంతర్గత అవయవాలు ఏర్పడటానికి ప్రోటీన్ పనిచేస్తుంది. ఇది కాకుండా కణాలు, కణజాలాలను సృష్టించడం, మరమ్మతు చేయడం, నయం చేయడం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల ఎముకలు పగుళ్లకు గురవుతాయి. వయసు పెరిగే కొద్దీ కండర ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత, బలం తగ్గుతాయి. అందువల్ల వృద్ధులకు పెద్దల కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం. కానీ బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తులు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటారు.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం
ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి ఆహారంలో గుడ్లు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, సోయా పాలు, టోఫు, బీన్స్, ఓట్స్, క్వినోవా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వేరుశెనగలను చేర్చుకోవాలి. ఒక వయోజన వ్యక్తికి శరీర బరువులో కిలోగ్రాముకు 0.8 నుంచి 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. కానీ బాల్యంలో, గర్భధారణ సమయంలో, తల్లి పాలివ్వడంలో, వృద్ధాప్యంలో ప్రోటీన్ ఎక్కువగా అవసరమవుతుంది.