Protein Rich Foods: ప్రొటీన్‌ పొందాలంటే గుడ్లు మాత్రమే కాదు ఇవి కూడా అవసరమే..!

Protein Rich Foods: శరీరానికి ప్రొటీన్‌ అత్యవసరం. ఇది లేకుంటే చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2023-05-31 15:30 GMT

Protein Rich Foods: ప్రొటీన్‌ పొందాలంటే గుడ్లు మాత్రమే కాదు ఇవి కూడా అవసరమే..!

Protein Rich Foods: శరీరానికి ప్రొటీన్‌ అత్యవసరం. ఇది లేకుంటే చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది వైద్య నిపుణులు ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి గుడ్లు, మాంసం తినమని సలహా ఇస్తారు. కానీ భారతదేశంలో కొంతమంది మాంసం తినరు. అలాంటి వారు కొన్ని కూరగాయలని ఎంచుకోవచ్చు. వీటిలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌లో ప్రొటీన్లు, క్యాలరీలు, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా చలికాలంలో పండిస్తారు. అయినప్పటికీ సంవత్సరం పొడవునా మార్కెట్‌లో లభిస్తాయి. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ప్రొటీన్ల కొరత ఉండదు.

2. బ్రోకలీ

బ్రోకలీ క్యాబేజీని పోలి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఆరోగ్యానికి గొప్ప వనరుగా చెప్పవచ్చు. దీనిని తినడం వల్ల ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ కూడా సమృద్ధిగా పొందవచ్చు. అందువల్ల, రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మరిచిపోవద్దు. తద్వారా కండరాలు బలంగా చేసుకోవచ్చు.

3. బచ్చలికూర

ఆకుకూరల్లో రారాజు బచ్చలికూర. ఇందులో ప్రోటీన్, విటమిన్ బి, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటివల్ల కండరాలు బలంగా తయారవుతాయి. కచ్చితంగా బచ్చలికూరని డైట్‌లో చేర్చుకోవడం అవసరమని గుర్తించండి.

4. పుట్టగొడుగులు

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని కోసం రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Tags:    

Similar News