జలుబు, దగ్గు ఎక్కువ కాలం ఉన్నాయా..! ఇది ఆ వ్యాధి కావొచ్చు..

Lung Cancer: చలికాలం సీజనల్‌ వ్యాధులతో పాటు చాలా రోగాలు బయటపడుతుంటాయి.

Update: 2021-12-13 11:30 GMT

జలుబు, దగ్గు ఎక్కువ కాలం ఉన్నాయా..! ఇది ఆ వ్యాధి కావొచ్చు..

Lung Cancer Symptoms: చలికాలం సీజనల్‌ వ్యాధులతో పాటు చాలా రోగాలు బయటపడుతుంటాయి. కొంతమందికి ఈ రోజులు గడ్డుకాలమనే చెప్పాలి. చర్మ సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు ఎక్కవగా వస్తాయి. ఇవేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం ఉంటాయి. వైద్యుడిని సంప్రదించి మందులు వాడినప్పటికి కొన్ని రోజుల తర్వాత మళ్లీ వస్తాయి. అయితే దగ్గు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దీర్ఘకాలిక దగ్గు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

చాలా సార్లు ప్రజలు దగ్గు, ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వెళుతారు. ఈ సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. చాలా సందర్భాల్లో బ్రోన్కైటిస్ లేదా రోగిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఇది జరుగుతుంది. కానీ చాలా కాలం దగ్గు ఉంటే మాత్రం ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అర్థం. ఇది తర్వాత క్యాన్సర్‌కు దారి తీస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజల జీవనశైలి సరిగ్గా లేకపోవడం దీనికి కారణమని చెప్పాలి. పొగతాగడం వల్ల కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. అందుకే దగ్గుని అస్సలు విస్మరించకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.

TB కూడా కావొచ్చు ఒక వ్యక్తికి మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే అది TB ట్యూబర్‌క్యులోసిస్ (TB) లక్షణం కావొచ్చు. దగ్గు సమస్య పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడమే TB రావడానికి అతి పెద్ద కారణం. వారు ఇంట్లోనే దగ్గును పరిష్కరించే పనిచేస్తారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తుంది. అప్పుడు రోగి డాక్టర్ వద్దకు వెళితే టీబీగా నిర్దారణ అవుతుంది. TB మరొక వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. రోగి దగ్గినప్పుడు, శరీరం నుంచి ప్రమాదకరమైన బిందువులు విడుదలవుతాయి. చుట్టుపక్కల కూర్చున్న మరొక వ్యక్తి శ్వాసకోశంలోకి ప్రవేశిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 

Tags:    

Similar News