రుచికరమైన పనసకాయ బిర్యానీ తయారీ ఇలా
పనస పిక్కల టేస్ట్ ఎంటో అందరికీ తెలిసిందే.. ఈ రుచుని ఆస్వాదించని వారంటూ ఎవరూ ఉండరు.
పనస పిక్కల టేస్ట్ ఎంటో అందరికీ తెలిసిందే.. ఈ రుచుని ఆస్వాదించని వారంటూ ఎవరూ ఉండరు.. పనస పిక్కలే కాదు... పనసకాయతోనే ఎన్నో రుచికరమైన వంటలను తయారుచేసుకోవచ్చు..మరీ భోజన ప్రియుల టేస్ట్‌కు అనుగుణంగా ఇవాళ మనం టేస్టీ పనసకాయ బిర్యానీ తయారు చేసుకుందాం.. పదండి.
కావాల్సిన పదార్ధాలు:
♦ పచ్చి పనసకాయ ముక్కలు
♦ బాస్మతి బియ్యం
♦ ఉల్లిపాయలు
♦ అల్లం వెల్లుల్లి పేస్టు
♦ పుదీనా
♦ బిర్యానీ మసాలా పొడి
♦ కారం
♦ కొత్తిమీర
♦ నూనె
♦ నెయ్యి
♦ లవంగాలు
♦ యాలాకులు
♦ దాల్చీనీ
♦ బిర్యానీ ఆకు
♦ ఉప్పు
♦ పచ్చిమిర్చి
♦ పెరుగు
తయారీ విధానం:
ముందుగా బాస్మతీ బియ్యాన్ని బాగా కడిగి ఒక ఔల్ లోకి తీసుకోవాలి.. బియ్యాన్ని 70 శాతం ఉడికించాలి...తరువాత నీటిని వడకట్టీ...అన్నాన్ని ఆరబెట్టాలి. ఇప్పుడు పనస కాయను తీసకుని ముక్కలుగా చేసుకోవాలి. అరకిలో బిర్యానీ రైస్‌కి అరకిలో ముక్కలు సరిపోతాయి. వాటిని కుక్కర్ లో వేసి పసుపు వేసి నీరు పోసి 50 శాతం ఉడికించాలి.
ఇప్పుడు రెండు ఉల్లి గడ్డలను తీసుకుని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి . ఈ ముక్కలను ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి పోసుకోవాలి..ఇప్పుడు లంగాలు, యాలాకులు, దాల్చీని, బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి...ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పనసముక్కలు వేసుకోవాలి... వాటిని వేపుకోవాలి...కాస్త మగ్గాక, కప్పు పూదీన, కప్పు కొత్తిమీర వేసుకోవాలి...ఇప్పుడు పావుకప్పు పచ్చిమిర్చి, అరకప్పు పెరుగు వేసుకోవాలి...ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుని కలుపుకోవాలి.. ఇందులోనే అల్‌రెడీ ప్రై చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకోవాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి...అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 5 నిమిషాల మగ్గనివ్వాలి...తరువాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఉల్లి వేయాలి. తరువాత పూదీనా, కొత్తిమీర వేసుకోవాలి..తరువాత కాస్త నెయ్యి పైనుంచి వేసుకోవాలి... మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తరువాత బిర్యానీ మొత్తం కలుపుకోవాలి..అంతే .. టేస్టీ టేస్టీ పనసముక్కల బిర్యానీ రెడీ.