Pineapple Health Benefits: పైనాపిల్ ఒక ఉష్ణమండల పండు.. తింటే శరీరానికి కచ్చితమైన 4 ప్రయోజనాలు..!
Pineapple Health Benefits: ఈ సీజన్‌లో మార్కెట్‌లో పైనాపిల్ ఎక్కువగా కనిపిస్తాయి. ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది.
Pineapple Health Benefits: ఈ సీజన్‌లో మార్కెట్‌లో పైనాపిల్ ఎక్కువగా కనిపిస్తాయి. ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. పైనాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాస్తవానికి ఇదొక ఉష్ణమండల పండు. బయట నుంచి గట్టిగా ముళ్ళుతో కనిపిస్తుంది. లోపల మాత్రం తీపి, జ్యుసిగా ఉంటుంది. పైన్ యాపిల్ విభిన్న రుచికి ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రజలు ఈ పండును ఎంతో ఇష్టంతో తింటారు. దాని జ్యూస్‌ను తాగడానికి ఇష్టపడుతారు. పైనాపిల్ తినడం వల్ల శరీరానికి కచ్చితమైన నాలుగు ప్రయోజనాలు లభిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
జీర్ణక్రియలో
పైనాపిల్‌లో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది అజీర్ణాన్ని తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం
పైనాపిల్‌లో పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధులతో పోరాడటానికి మీకు శక్తిని ఇస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యంలో
పైనాపిల్‌లో ఉండే ఫైబర్, విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు అధిక రక్తపోటు సమస్య దూరమవుతుంది.
చర్మానికి ఆరోగ్యకరం
పైనాపిల్‌లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి చర్మానికి మెరుపును తెస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే ఇది అధిక చక్కెర పండు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.