Health Tips: ఈ చట్నీ పురుషులకి ఒక వరం.. సంతానోత్పత్తి సమస్యలు దూరం..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలని ఎదుర్కొంటున్నారు.

Update: 2023-02-22 14:30 GMT

Health Tips: ఈ చట్నీ పురుషులకి ఒక వరం.. సంతానోత్పత్తి సమస్యలు దూరం..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలని ఎదుర్కొంటున్నారు. మారిన జీవనపరిస్థితులు, ఆహార విధానం, చెడు అలవాట్లు దీనికి కారణం అవుతున్నాయి. దీనివల్ల చాలామంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల మందులని వాడుతున్నారు. వీటి వల్ల ఉపయోగం తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. వాస్తవానికి లైంగిక సమస్యల నుంచి బయటపడటానికి మందులు అవసరం లేదు. ఇంటి చిట్కాల ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

ఉల్లిపాయ,వెల్లుల్లి చట్నీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల పురుష బలం పెరిగి శారీరక బలహీనత తొలగిపోతుంది. తండ్రి కావాలనే అతడి కోరిక నెరవేరుతుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే ఉల్లిపాయ,వెల్లుల్లి చట్నీ ఏ విధంగా తయారుచేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు

ఒక పెద్ద ఉల్లిపాయ,

5 వెల్లుల్లి రెబ్బలు,

రెండు పెద్ద టొమాటోలు,

కొన్ని పచ్చిమిర్చి,

అర టీస్పూన్ నల్ల ఉప్పు,

అర టీస్పూన్ పంచదార,

తెల్ల ఉప్పు, రుచి ప్రకారం,

ఒక టీస్పూన్ వేయించిన జీలకర్ర,

నిమ్మరసం.

చట్నీ ఎలా తయారు చేయాలి..?

ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను గ్యాస్‌పై వేయించి ఆ తర్వాత పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. అంతే చట్నీ తయారవుతుంది. దీనిని అన్నం-పప్పు లేదా రోటీతో తినవచ్చు. ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషుల జననాంగాలు బలపడతాయి. ఇది లైంగిక కోరికను పెంచుతుంది. దీన్ని తినడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. మెయిల్ స్టామినాను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.

వెల్లుల్లితో సంతానలేమి దూరం

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పురుషుల బలం పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సిరల్లో రక్త ప్రసరణను వేగంగా పెంచుతుంది. పురుషులు వంధ్యత్వానికి దూరంగా ఉంటారు. దీన్ని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ మెరుగవుతాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు.

Tags:    

Similar News