Health Tips: నిద్రకి సంబంధించిన ఈ వ్యాధి చాలా డేంజర్.. మీలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
Health Tips: మార్చి మూడవ శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
Health Tips: మార్చి మూడవ శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ద్వారా నిద్ర ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల నిద్ర విధానం చాలా మారింది. కోవిడ్ తర్వాత నిద్ర సమస్యలు మరింత పెరిగాయి. సరైన నిద్ర లేకపోవటం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యను ఎదుర్కొంటున్నారు . ఇది ప్రమాదకరమైన నిద్ర రుగ్మత. దీనికి సకాలంలో చికిత్స అవసరం. లేదంటే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా నిద్రపోతున్నప్పుడు కొన్ని సెకన్ల పాటు శ్వాస తీసుకోలేరు. రోగికి ఈ సమస్య గురించి తెలియదు. కానీ ఈ సమస్య నిరంతరం కొనసాగితే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవిస్తుంది. స్థూలకాయంతో బాధపడుతున్న వ్యక్తులు దీని బారిన ఎక్కువగా పడుతారు. ఈ వ్యాధి కారణంగా రాత్రిపూట గురక సమస్య ఎదురవుతుంది.
నిద్రలేమి ఒక మహమ్మారి లాంటిది. ఇది మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా చాలా ప్రమాదకరమైన వ్యాధి. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం మందికి సకాలంలో వైద్యం అందడం లేదు. స్లీప్ అప్నియా అనేది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఈ పరిస్థితిలో దీనిని నివారించడం చాలా ముఖ్యం.