Obesity: పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది.. ఈ పద్దతులు అనుసరిస్తే బయటపడొచ్చు..!

* 2030 నాటికి భారతదేశంలో 27 మిలియన్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడే ప్రమాదం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ పేర్కొంది.

Update: 2022-11-24 06:03 GMT

పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది.. ఈ పద్దతులు అనుసరిస్తే బయటపడొచ్చు

Obesity: ఈ రోజుల్లో చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం సమస్య విపరీతంగా పెరుగుతోంది. అత్యధికంగా పిల్లలు స్థూలకాయం బారిన పడుతున్నారు. గత 30 సంవత్సరాలలో రెట్టింపు పిల్లలు ఊబకాయం బారిన పడ్డారు. 2030 నాటికి భారతదేశంలో 27 మిలియన్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడే ప్రమాదం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ పేర్కొంది. పిల్లల్లో ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లేనని నిపుణులు భావిస్తున్నారు.

పిల్లలు తరచుగా జంక్ ఫుడ్ లేదా ప్యాక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కరోనా నుంచి పిల్లలలో వ్యాయామం, ఇతర శారీరక శ్రమ లేదు. ఎక్కువ సమయం ఇంట్లో ఉండడం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఊబకాయం వల్ల పిల్లలకు గుండె జబ్బులు, మధుమేహం, ఆస్తమా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఊబకాయం ప్రధాన సమస్య. 8 నుంచి 14 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల అభివృద్ధికి తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం అవసరం.

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించండి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించండి. దీని కోసం తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు, బీన్స్, గుడ్లు , పాలు ఇవ్వండి. పిల్లల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వును తక్కువగా చేర్చండి. పిల్లలను హైడ్రేట్ గా ఉంచండి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే నీళ్లు తాగడం అవసరం. ఇందుకోసం పాఠశాలకు వెళ్లేటప్పుడు లేదా బయటికి వెళ్లేటప్పుడు వాటర్ బాటిళ్లు అందించండి. పిల్లలు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండేలా చూడండి. సాయంత్రం పార్కుకు లేదా ఏదైనా క్రీడలలో పాల్గొనేలా చూడండి.

Tags:    

Similar News