Girls Height: అమ్మాయిల హైట్‌ విషయంలో ఈ విషయాలు గమనించండి..!

Girls Height: ఒక వ్యక్తి వికాసానికి మంచి ఎత్తు ఉండటం కచ్చితంగా అవసరం.

Update: 2022-08-23 13:00 GMT

Girls Height: అమ్మాయిల హైట్‌ విషయంలో ఈ విషయాలు గమనించండి..!

Girls Height: ఒక వ్యక్తి వికాసానికి మంచి ఎత్తు ఉండటం కచ్చితంగా అవసరం. అమ్మాయిలకు ఇది చాలా ముఖ్యం. మంచి ఎత్తు మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. పొడవాటి అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారని నమ్మకం. కానీ అమ్మాయిల ఎత్తు పెరగడం త్వరగా ఆగిపోతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల 14-15 ఏళ్లు దాటినా ఆడపిల్లల ఎత్తు ఆగిపోతుంది. ఆడపిల్లల ఎత్తు అంతగా పెరగకపోవడానికి గల కారణాన్ని తెలుసుకుందాం.

బాల్యంలో అమ్మాయిల ఎత్తు వేగంగా పెరుగుతుంది. కానీ 14-15 సంవత్సరాల వయస్సులో వారి పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు ఎత్తు పెరగడం ఆగిపోతుంది. పీరియడ్స్ ప్రారంభమైన కొంత కాలానికి ఎత్తు పెరుగుదల మందగిస్తుంది. ఈ పరిస్థితిలో ఒక అమ్మాయి ఎత్తు తక్కువగా ఉంటే దాని గురించి ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

పీరియడ్స్ ప్రారంభానికి ముందు 1-2 సంవత్సరాల వరకు బాలికల ఎత్తు వేగంగా పెరుగుతుంది. కానీ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. చాలా మంది అమ్మాయిలకి 8 నుంచి 13 సంవత్సరాల వయస్సులో రుతుక్రమం ప్రారంభమవుతుంది. తరువాత బాలికలు ఎత్తు 1-2 అంగుళాలు మాత్రమే పెరుగుతారు. ఈ వయస్సులో అమ్మాయిలు తమ వయోజన ఎత్తుకు చేరుకుంటారు. కొంతమంది అమ్మాయిలు చిన్న వయస్సులోనే పెద్దల ఎత్తుకు చేరుకుంటారు. ఇది వారి పీరియడ్స్ రాకపై ఆధారపడి ఉంటుంది.

మంచి ఎత్తు కోసం పిల్లలకు సరైన ఆహారం అందించడం అవసరం. ఆకుపచ్చ కూరగాయలు, విటమిన్లు, అవసరమైన పోషకాలతో బాలికల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇది వారి ఎత్తును పెంచుతుంది. శారీరక శ్రమ ద్వారా కూడా ఎత్తు పెరుగుదల జరుగుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు రోజంతా సరైన మొత్తంలో నీరు తాగకపోతే అది మీ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య వృద్ధికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకుంటే హైట్‌ పెరగడంపై ప్రభావం పడుతుంది.

Tags:    

Similar News