Health News: మనిషి రక్తంలో ప్లాస్టిక్.. ఎలా ప్రవేశిస్తుందో తెలుసా..!

Health News: మనిషి రక్తంలో ప్లాస్టిక్.. ఎలా ప్రవేశిస్తుందో తెలుసా..!

Update: 2022-03-27 15:45 GMT

Health News: మనిషి రక్తంలో ప్లాస్టిక్.. ఎలా ప్రవేశిస్తుందో తెలుసా..!

Health News: మనిషి రక్తంలోకి ప్లాస్టిక్ నిదానంగా ప్రవేశిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో 80 శాతం మంది వ్యక్తుల రక్తంలో ప్లాస్టిక్ చిన్న రేణువులు ఉన్నట్లు తేలింది. అంతే కాకుండా ఈ పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలుzవెలుగులోకి వచ్చాయి. ఈ చిన్న కణాలు నీరు, శ్వాస, ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం పరీక్షించిన 77 శాతం మంది వ్యక్తుల రక్తప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. డచ్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) అనేది మానవ రక్తంలో కనిపించే ప్లాస్టిక్ అత్యంత సూక్ష్మరూపం. PET సాధారణంగా నీరు, ఆహారం, దుస్తుల ద్వారా శరీరంలోకి చేరుతుంది.

గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా ప్లాస్టిక్‌ మనిషి శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని నివేదికలో వెల్లడైంది. ఎందుకంటే ప్రజలు ఎంత ప్లాస్టిక్‌ని మింగేస్తున్నారో తెలియడం లేదు. శరీరంలో ఈ ప్లాస్టిక్ కణాల వల్ల మంట పెరిగే అవకాశం ఉంది. పరిశోధనలో కనీసం 5 రకాల ప్లాస్టిక్ నమూనాలు కనుగొన్నారు. ఇందులో పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్, పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) ఉన్నట్లు తేలింది. ఇందుకోసం 22 మంది రక్త నమూనాలను తీసుకున్నారు. ఇందులో 17 మంది రక్తంలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

రక్తంలో శాస్త్రవేత్తలు కనుగొన్న మూడో రకం ప్లాస్టిక్ క్యారియర్ బ్యాగుల తయారీకి ఉపయోగించే పాలిథిలిన్ అని నివేదిక పేర్కొంది. ఈ పరిశోధన గురించి ప్రొఫెసర్ డిక్ వెథక్ మాట్లాడుతూ.. 'మన రక్తంలో పాలీమెరిక్ కణాలు ఉన్నాయని పరిశోధన మొదటి సూచన. ఇది ఒక ముఖ్యమైన ఆవిష్కరణ'. ఈ పరిశోధనను మరింత పెంచేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News