Low Budget Smart Phones for Honor: హనర్ నుంచి.. అతి తక్కువ ధరలో న్యూ ప్యూచర్స్ స్మార్ట్‌ఫోన్లు..
Low Budget Smart Phones for Honor: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన వాటాను సుసిర్థం చేసుకోవడానికి.. చాలా తక్కువ ధరతో రెండు సరికొత్త స్మార్ట్ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది.
Low Budget Smart for Honor: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన వాటాను సుసిర్థం చేసుకోవడానికి.. చాలా తక్కువ ధరతో రెండు సరికొత్త స్మార్ట్ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవే హానర్ 9ఏ, హానర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్ల అమ్మకాలు ఆగస్ట్ 6న ప్రారంభం అవుతుంది. ఇక హానర్ 9ఎస్ ధర రూ.6,499 కాగా, హానర్ 9ఏ ధర రూ.9,999గా నిర్ణయించారు. అయితే ఫస్ట్ సేల్‌లో కొనేవారికి హానర్ 9ఎస్ రూ.5,999 ధరకు, హానర్ 9ఏ రూ.8,999 ధరకు లభించనున్నాయి.
హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్:
* 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
* 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,
* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్,
* 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,
* 3020 ఎంఏహెచ్ బ్యాటరీ
* 2జీబీ ర్యామ్.. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* మ్యాజిక్ యూఐ 3.1.1 ఆపరేటింగ్ సిస్టమ్
హానర్ 9ఏ స్పెసిఫికేషన్స్:
* 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,
* 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* మ్యాజిక్ యూఐ 3.1.1 ఆపరేటింగ్ సిస్టమ్
* బ్యాక్ కెమెరా 13+5+2 మెగాపిక్సెల్ , ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సల్
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ ఉండదు. యాప్స్ కోసం హువావే రూపొందించిన యాప్ గ్యాలరీ ఉంటుంది. హానర్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.