జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే బరువు తగ్గండి.. ఈ పద్దతులు అనుసరిస్తే చక్కటి ఫలితం..!
జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే బరువు తగ్గండి.. ఈ పద్దతులు అనుసరిస్తే చక్కటి ఫలితం..!
Weight Loss Tips: బరువు పెరగడం చాలా సులభం కానీ తగ్గడం చాలా కష్టం. ఈ రోజుల్లో శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించడానికి ప్రజలు చాలా కష్టపడుతున్నారు. దీని కోసం చాలా మంది జిమ్‌లో చేరుతున్నారు. కొంతమంది నడకను ఎంచుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ జిమ్‌కి, గ్రౌండ్‌కి వెళ్లి వర్కువుట్స్ చేయాలంటే సమయం ఉండదు. కానీ జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
యోగా
మీరు పెరిగిన బరువును తగ్గించుకోవాలనుకుంటే దినచర్యలో యోగాను చేర్చుకోవాలి. రోజూ 20 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీంతోపాటు రాత్రి భోజనంలో ఎక్కువగా వేయించిన వాటిని తినకూడదు. ఇవి శరీరంలో కొవ్వును పెంచుతాయని గుర్తుంచుకోండి.
క్యారెట్ రసం
పెరిగిన బరువు తగ్గించుకోవడానికి క్యారెట్ జ్యూస్ తాగవచ్చు. ఈ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరం నుండి కొవ్వును తొలగిస్తుంది. క్యాబేజీ సూప్ కూడా తాగవచ్చు. ఈ సూప్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది.
నిమ్మకాయ-తేనె రెమెడీ
శరీర బరువును తగ్గించుకోవడానికి రోజూ నిమ్మ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ మూడింటి మిశ్రమం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కొద్ది రోజుల్లోనే కరిగిపోతుంది.
రోజూ 7-8 గ్లాసుల నీరు
శరీర బరువును సమతుల్యంగా ఉంచడానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దీని కోసం ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే బరువు పెరగకుండా ఉంటారు.