Health Tips: గుడ్డులోని పచ్చసొన తినాలా వద్దా.. చాలామంది కన్‌ఫ్యూజన్‌ కు పరిష్కారం..!

Health Tips: గుడ్డు అనేది ఒక సూపర్‌ ఫుడ్‌. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి డాక్టర్‌ ప్రతిరోజు కనీసం ఒక గుడ్డు అయినా తినాలని సూచిస్తారు.

Update: 2024-02-20 13:00 GMT

Health Tips: గుడ్డులోని పచ్చసొన తినాలా వద్దా.. చాలామంది కన్‌ఫ్యూజన్‌ కు పరిష్కారం..!

Health Tips: గుడ్డు అనేది ఒక సూపర్‌ ఫుడ్‌. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి డాక్టర్‌ ప్రతిరోజు కనీసం ఒక గుడ్డు అయినా తినాలని సూచిస్తారు. కానీ చాలామంది గుడ్డులోని పచ్చసొన గురించి ఆలోచించి తినడం మానేస్తారు. ఇప్పటికీ దీని గురించి పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్డులోని పసుపు భాగాన్ని తక్కువగా తినడం మంచిది.

గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ ఈ, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి పనితీరుకు అవసరమవుతుంది. గుడ్డు పచ్చసొనలో యాంటీ ఆక్సిడెంట్లు అయిన లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును పెంచడంలో సాయపడుతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. వీటిని పరిమిత పరిమాణంలో తింటే బరువు మెయింటెన్‌ అవుతుంది.

గుడ్డు సొనలు రోజంతా శక్తిని అందించగల అధిక-నాణ్యత ప్రోటీన్ మూలం. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి హెచ్‌డిఎల్ స్థాయిని పెంచుతాయి. అంటే ఇది మంచి కొలెస్ట్రాల్. గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణలో సాయపడుతుంది. బలమైన ఎముకలను ప్రోత్సహిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.

Tags:    

Similar News