సాధారణ జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్‌కి తేడా తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడుతారు..!

*సాధారణ జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్‌కి తేడా తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడుతారు..!

Update: 2023-01-12 15:30 GMT

సాధారణ జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్‌కి తేడా తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడుతారు..!

Health Tips: సాధారణ జలుబు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తికి మొదట జలుబు ఏర్పడి తర్వాత ఛాతీ ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. ఈ దశ తర్వాత అది మరింత ప్రాణాంతకంగా రూపాంతరం చెందుతుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ దిగువ శ్వాసకోశ, బ్రోన్చియల్ ట్యూబ్‌లను ప్రభావితం చేస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్ళే వాయుమార్గాల (ట్యూబ్స్) వాపును సూచిస్తుంది.

సాధారణ జలుబు లక్షణాలు

ఛాతి ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు రెండింటి లక్షణాలు తేలికపాటి జ్వరం, శరీర నొప్పి, దగ్గు, బలహీనతగా చెప్పవచ్చు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బిగుతు, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి ముఖ్యంగా ఛాతీ ఇన్ఫెక్షన్ లక్షణాలు. సాధారణ జలుబు ఉన్న వ్యక్తికి తుమ్ములు, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, కళ్ళలో నీరు కారడం వంటివి ఉంటాయి. సాధారణ జలుబు వ్యక్తి రోగనిరోధక శక్తిని బట్టి 6 నుంచి 7 రోజులు ఉంటుంది.

చికిత్స

ఛాతి ఇన్ఫెక్షన్, జలుబుకు వైద్య చికిత్స లేదు. యాంటీబయాటిక్స్ తీసుకోవడం నివారించండి. ఎందుకంటే అవి వైరల్ ఇన్ఫెక్షన్లలో పని చేయకపోవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ పుష్కలంగా విశ్రాంతి తీసుకోవడం, వేడి వేడి సూప్, గోరువెచ్చని నీరు వంటి ద్రవాలను తాగడం ఉత్తమం. కెఫిన్‌కు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆవిరి కూడా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం నాసల్ స్ప్రేని ఎంచుకోవచ్చు. ఇది శ్వాసకోశ సమస్యలు, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Tags:    

Similar News