Health Tips: తరచుగా కడుపునొప్పిగా ఉంటుందా.. జాగ్రత్త ఈ క్యాన్సర్ లక్షణం కావొచ్చు..!
Health Tips: శరీరంలో పెద్దప్రేగు వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Health Tips: శరీరంలో పెద్దప్రేగు వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కి గురవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ క్యాన్సర్‌ని అంత తొందరగా గుర్తించలేము. ఒకవేళ ప్రారంభ దశల్లో వ్యాధి నిర్ధారణ జరిగినట్లయితే 90% కంటే ఎక్కువ కేసులు నయం చేయవచ్చు. పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు
గత కొన్ని సంవత్సరాలుగా పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మలబద్ధకం లేదా మలం రంగులో మార్పు ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అయితే ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఈ లక్షణాలు ఏర్పడుతాయి. అయితే ఈ లక్షణాలు చాలా రోజులు కొనసాగితే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే మీకు నిరంతర పొత్తికడుపు నొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యంగా అనిపిస్తే అది పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం అయి ఉంటుందని గమనించండి.
మలంలో రక్తాన్ని గమనించినట్లయితే అది పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఎటువంటి ప్రయత్నం లేకుండా అకాలంగా బరువు తగ్గినట్లయితే అది పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ ఆహారాన్ని జీవక్రియ చేసే విధానంలో మార్పులను కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. అసాధారణంగా అలసిపోయినట్లు లేదా బలహీనంగా భావిస్తే అది పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఇది రక్తహీనత, అలసటకు దారితీస్తుంది.
పెద్దపేగు క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. ఇది ప్రారంభ దశలోనే గుర్తించడం కష్టం. అయితే పైన ఉన్న లక్షణాలలో దేనినైనా గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రారంభ గుర్తింపు, చికిత్సతో పెద్దప్రేగు క్యాన్సర్‌ను విజయవంతంగా నయం చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు చికిత్స తర్వాత దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉంటారని గుర్తుంచుకోండి.