Health Tips: కిడ్నీ రోగులు పొరపాటున కూడా వీటి జోలికి పోకూడదు..!

Health Tips: ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలు హెల్తీగా ఉంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.

Update: 2023-11-30 16:00 GMT

Health Tips: కిడ్నీ రోగులు పొరపాటున కూడా వీటి జోలికి పోకూడదు..!

Health Tips: ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలు హెల్తీగా ఉంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీకి సంబంధించిన సమస్యలుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. కిడ్నీలు మన శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి పని చేస్తాయి. అందువల్ల కిడ్నీలకు సంబంధించిన సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కిడ్నీ వ్యాధులు ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అధిక సోడియం ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, కార్బోనేటేడ్ పానీయాలు, అధిక ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి. జీవనశైలి, ఆహార విధానం మార్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఊరగాయ

కిడ్నీ రోగులు పొరపాటున కూడా పచ్చళ్లు తినకూడదు. ఊరగాయల్లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే ఊరగాయలకు దూరంగా ఉండాలి.

అధిక ప్రోటీన్

వాస్తవానికి ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కానీ అధిక మోతాదు మన మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పడుతుంది. బీన్స్, కాయధాన్యాలు, ఇతర అధిక ప్రోటీన్ పదార్థాలను పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఈ కారణంగానే కిడ్నీ రోగులు దీనికి దూరంగా ఉండాలి. బదులుగా పైనాపిల్ తినాలి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కిడ్నీలు సక్రమంగా పనిచేస్తాయి.

బంగాళదుంప

బంగాళదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. బంగాళాదుంపలను ఉపయోగించే ముందు వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. దీనివల్ల అందులో ఉండే పొటాషియం మొత్తం తగ్గుతుంది. అయితే మొత్తం పొటాషియం బయటకు రాదు. కాబట్టి కిడ్నీ రోగులు ఎక్కువగా బంగాళదుంపలు తినకూడదు.

కెఫిన్

కిడ్నీ రోగులు కెఫిన్‌కు దూరంగా ఉండాలి. శరీరంలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. రక్తపోటు పెరిగినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది.

Tags:    

Similar News