Jaggery Benefits: బెల్లం పోషకాల నిధి.. చలికాలం చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం..!
Jaggery Benefits: బెల్లం పోషకాల నిధి.. చలికాలం చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం..!
Jaggery Benefits: చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే బెల్లం ప్రభావం వేడిగా ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, గ్లూకోజ్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. చలికాలంలో బెల్లంతో చేసిన వంటకాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం తీపికి ప్రత్యామ్నాయం కూడా. చలికాలంలో బెల్లంతో చేసిన ఎలాంటి ఆహారాలు తినవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.
చలికాలంలో బెల్లం, వేరుశెనగతో చేసిన పల్లిపట్టీలని చిరుతిండిగా తీసుకోవచ్చు. పెద్దలైనా, పిల్లలైనా వీటిని అందరూ ఇష్టపడతారు. ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటి తయారీకి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. అలాగే చలికాలంలో బెల్లం, నువ్వులు కలిపి లడ్డులను తయారు చేసుకోవచ్చు. నువ్వుల వినియోగం శరీరానికి మేలు చేస్తుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
నార్త్ ఇండియాలో బెల్లంతో ఖీర్ చేస్తారు. దీనిని ఎక్కువగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో చేస్తారు. ఖీర్ రుచి, వాసన రెండూ చాలా బాగుంటాయి. అలాగే బెల్లం, సగ్గుబియ్యంతో బెల్లం పరాటాలు కూడా చేసుకోవచ్చు. వీటిని ఉదయం అల్పాహారంగా కూడా తినవచ్చు.అలాగే బెల్లం ఉదర సమస్యలను తొలగించడంలో పనిచేస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల కడుపు నొప్పి సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఉదయం వేళ అల్లం, బెల్లం కలిపి తీసుకున్నా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. బెల్లంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేయడంలో సాయపడతాయి. దీంతోపాటు చెక్కర ఉపయోగించకుండా బెల్లంను ఉపయోగించడం వల్ల రక్త, షుగర్ సంబంధిత అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.