Health Tips: జుట్టు విపరీతంగా రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు..!

Health Tips: ఒత్తైన జుట్టు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Update: 2023-01-28 14:30 GMT

Health Tips: జుట్టు విపరీతంగా రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు..!

Health Tips: ఒత్తైన జుట్టు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా చాలామంది జుట్టురాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. విపరీతంగా జుట్టు రాలడంతో కొంతమంది బట్టతలకి గురవుతున్నారు. అయితే మార్కెట్‌లో లభించే ప్రొడాక్ట్స్‌ జుట్టురాలే సమస్యని ఆపలేకపోతున్నాయి. కానీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యకి చెక్ పెట్టోచ్చు. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో నుంచి రసాన్ని తీసి గిన్నెలో వేయాలి. తర్వాత ఈ రసాన్ని జుట్టు మూలాల్లో బాగా రాయలి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. తరువాత జుట్టును షాంపుతో కడగాలి. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీంతోపాటు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

మెంతులు

ఒక కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తరువాత ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి 1-2 సార్లు ఈ రెసిపీని ప్రయత్నిస్తే ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

ఉసిరి

ఒక గిన్నెలో ఒక చెంచా ఉసిరి పొడి, నీరు వేసి పేస్టులా చేసుకోవాలి. కావాలంటే అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించాలి. సుమారు 35 నుంచి 40 నిమిషాలు అప్లై చేసి జుట్టును షాంపుతో కడగాలి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీంతోపాటు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Tags:    

Similar News