Health Tips: ఆహారంలో ఈ మార్పులు చేస్తే మూడ్‌ ఫ్రెష్‌గా ఉంటుంది.. అవేంటంటే..?

Health Tips: అధిక వేడి కారణంగా తరచుగా చెమటలు పడుతాయి.

Update: 2023-02-24 01:30 GMT

Health Tips: ఆహారంలో ఈ మార్పులు చేస్తే మూడ్‌ ఫ్రెష్‌గా ఉంటుంది.. అవేంటంటే..?

Health Tips: అధిక వేడి కారణంగా తరచుగా చెమటలు పడుతాయి. దీనివల్ల చికాకుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీని కారణంగా మీ మూడ్ రోజంతా తాజాగా ఉంటుంది. మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఏది తినాలని అనిపించదు. ఈ సందర్భంలో శరీరంలో సెరోటోనిన్ అనే మూలకం లోపం ఉంటుంది. ఇది ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్. దీని వల్ల మూడ్ స్వింగ్స్ ఆగిపోతాయి. శరీరంలో సెరోటోనిన్ లోపం రాకుండా ఉండాలంటే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది. ఇందుకోసం ఆహారంలో అరటిపండ్లను చేర్చుకోవచ్చు. ఇందులో ట్రిప్టోఫాన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. అందుకే అరటిపండు తినడం వల్ల మూడ్ బాగుంటుంది. అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది కాకుండా ఆహారంలో బాదంను కూడా చేర్చుకోవచ్చు. వీటిలో ఫోలేట్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇది కాకుండా పైనాపిల్‌లో ట్రిప్టోఫాన్, బ్రోమెలిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అదే విధంగా సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా మూడ్ స్వింగ్‌లను నివారించవచ్చు. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ మంచి పరిమాణంలో ఉంటుంది. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మరిచిపోవద్దని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News