Lipstick Side Effects: మహిళలకి హెచ్చరిక.. లిప్ స్టిక్ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్‌ అవుతారు..!

Lipstick Side Effects: మహిళలకి హెచ్చరిక.. లిప్ స్టిక్ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్‌ అవుతారు..!

Update: 2022-10-28 15:30 GMT

Lipstick Side Effects: మహిళలకి హెచ్చరిక.. లిప్ స్టిక్ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్‌ అవుతారు..!

Lipstick Side Effects: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు. మహిళలైతే ఇక చెప్పనవసరం లేదు. మార్కెట్‌లో లభించే బ్యూటి ప్రొడాక్ట్స్‌ అన్ని వాడుతారు. దీనికోసం చాలా ఖర్చు చేస్తారు. ఇదిలా ఉంటే బ్యూటీ ప్రొడాక్ట్స్‌పై కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందులో ఒకటి లిప్‌స్టిక్‌. ఇది పెదాలని అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే వీటి తయారీలో కెమికల్స్ వాడుతారు. దీనివల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతోంది. లిప్‌స్టిక్ వాడటం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లోని ఒక అధ్యయనం ప్రకారం లిప్‌స్టిక్‌ రంగును తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం ఉపయోగిస్తారని తేలింది. లిప్ స్టిక్ వాడటం వల్ల రకరకాల అలర్జీలు సంభవిస్తాయి.ఒక పరిశోధన ప్రకారం పెదవులకు అప్లై చేసే బ్యూటీ ప్రొడక్ట్స్‌ తయారీలో చాలా కెమికల్స్ వాడుతున్నారు. ఈ రసాయనాల్లో సీసం కూడా ఉంటుంది. పెదవులపై లిప్ స్టిక్ అప్లై చేయడం వల్ల నోటి ద్వారా అది పొట్టలోకి చేరుతుంది. ఇది రకరకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది.

మహిళలు రసాయన లిప్‌స్టిక్‌లు మానేసి సహజసిద్దంగా తయారుచేసినా మూలికా లిప్‌స్టిక్‌లని ఎంచుకోవాలి. లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి ఉపయోగించే సీసం గర్భధారణకు కూడా ప్రమాదకరం. ఇది గర్భిణీకి ఆమె పిండానికి హాని కలిగిస్తుంది. లిప్ స్టిక్ ద్వారా కడుపులోకి చేరి తద్వారా రక్తంలో సీసం స్థాయి పెరుగుతోంది. ముఖ్యంగా గర్భిణీలు లిప్‌స్టిక్‌కి దూరంగా ఉండాలి.

Tags:    

Similar News