Health Tips: గుండె సమస్యలుంటే వీటిని వాడకూడదు.. చాలా ప్రమాదం..!

Health Tips: మానవ శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. చెడు ఆహారం, మానసిక ఒత్తిడి హృదయ స్పందనల వేగాన్ని తగ్గిస్తుంది.

Update: 2023-11-23 14:30 GMT

Health Tips: గుండె సమస్యలుంటే వీటిని వాడకూడదు.. చాలా ప్రమాదం..!

Health Tips: మానవ శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. చెడు ఆహారం, మానసిక ఒత్తిడి హృదయ స్పందనల వేగాన్ని తగ్గిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. గుండె ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు తినకూడదు. మీ హృదయానికి హాని కలిగించే అలాంటి ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నూనెలు

రిఫైన్డ్ ఆయిల్ గుండెకు హాని చేస్తాయి. అందుకే ఆలివ్ ఆయిల్, వేరుశెనగ ఆయిల్‌ తో చేసిన ఆహార పదార్థాలు తింటే గుండెకు ఆరోగ్యకరం. అయితే నూనె ఏది అయినా హృదయానికి హాని చేస్తుంది. అందువల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నూనె తీసుకోవడం మానేయండి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. కానీ ఇందులో నిజంలేదు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి గుండె రోగులకు, మధుమేహ రోగులకు హానికరం. కాబట్టి డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

సోడా

సోడా అనేది గుండె ఆరోగ్యానికి హాని కలిగించే పానీయం. అందువల్ల హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పొరపాటున కూడా సోడా తాగకూడదు. అలాగే ఆల్కహాల్, ధూమపానం రెండు గుండెకు హానిచేసేవే. ఈ రెండు మానేయడం ఉత్తమం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News