Diabetes Symptoms: రాత్రిపూట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే షుగర్ టెస్ట్ చేయించుకోండి.. ఎందుకంటే..?
Diabetes Symptoms: ప్రపంచంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
Diabetes Symptoms: ప్రపంచంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. భారతదేశంలో మాత్రం వేగంగా విస్తరిస్తుంది. మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల వెంటనే ప్రాణాలు పోవు కానీ అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందుకే దీనిని త్వరగా గుర్తించి చికిత్సం ప్రారంభించడం ఉత్తమం. కొంతమంది రాత్రిపూట కొన్ని సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే వాటిని నార్మల్‌గా భావించి వదిలేస్తారు. ఇందులో కొన్ని లక్షణాలు డయాబెటీస్‌కు సంబంధించినవి ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
రాత్రి నిద్రలో తరచుగా దాహం వేయడం, పదే పదే లేవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్న ట్లయితే మధుమేహానికి సంకేతమని గుర్తుంచుకోండి. శరీరంపై గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ తగ్గడం, కాళ్లు తిమ్మిర్లు ఎక్కువవడం కూడా మధుమేహ లక్షణలు అవుతాయి. ఇలాంటి సమయంలో వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవడం అవసరం. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం. శృంగార కోరికలు సన్నగిల్ల డం. చర్మం ముడత పడటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
ఇంట్లో ఫ్యాన్, కూలర్ నడుస్తున్నా కొంతమందికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో గ్లూకోజ్ స్థాయిలని చెక్ చేసుకోవాలి. ఇది కూడా మధుమేహానికి సంకేతం అవుతుంది. టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఇది బయటపడుతుంది. అందుకే ఆరోగ్యం విషయంలో అలర్ట్‌గా ఉండాలి.డయాబెటీస్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా శారీరక శ్రమ చేయాలి. వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో లేచి నడవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.