Love: లవ్‌లో పడ్డారా.. అయితే వీటిని కోల్పోయినట్లే..!
Love: ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండే ఫీలింగ్. ఇది ఎవ్వరిలోనైనా ఎప్పుడైన కలగవచ్చు.
Love: ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండే ఫీలింగ్. ఇది ఎవ్వరిలోనైనా ఎప్పుడైన కలగవచ్చు. ప్రేమించుకునే జంటలకు కొదువేలేదు. ఆక్సీటోసిన్, వాసోప్రెస్సిన్ వంటి హార్మోన్లు ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి సహాయం చేస్తాయట. వీటి కారణంగా ప్రేమ పుట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుదట. ఒక వ్యక్తికి ప్రేమ పుట్టడానికి కేవలం సెకన్లో ఐదో వంతు సమయం సరిపోతుందట. ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడింది.
అయితే ప్రేమలో పడేంత వరకు బాగానే ఉంటుంది.. పడ్డాకే అసలు కథ మొదలవుతుంది. కొంతమంది నిపుణుల అధ్యయనం ప్రకారం ప్రేమలో పడిన వ్యక్తులు ఈ మూడు విషయాలను వారికి తెలియకుండానే కోల్పోతున్నారని తెలిసింది. ఈ విషయంలో వారికి బాగానే ఉన్నా ఇతరుల నుంచి మాత్రం చివాట్లు తప్పవు.
1. ఆకలి, నిద్ర తెలియదట..
ప్రేమలో పడిన కొత్తలో చాలా మందికి ఆకలి తెలియదట. అంతే కాదు నిద్ర పట్టే అవకాశం కూడా తక్కువని చెబుతుంటారు. ఇదంతా నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ప్రేమలో ఉన్న సమయంలో డోపమైన్, నోర్ పైన్ ఫ్రైన్ హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల ఓ వ్యక్తికి ఎక్కువ సంతోషం, ఉత్సాహం పెరుగుతాయట. దీంతో ఆకలి, నిద్ర పోవాలని ఆశ తగ్గిపోతాయట. ఎప్పుడేం చేస్తారో వారికే తెలియదట.
2. అలవాట్లలో మార్పులు..
ప్రేమలో పడిన వారిలో వారికి తెలియకుండానే చాలా మార్పులు వస్తుంటాయట. ముఖ్యంగా వారి చూపులు డ్రస్సులు, ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడని తెలుసుకునేందుకు అతడి అలవాట్లను గమనిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రేమ ఆ వ్యక్తి జీవితంలోని భావోద్వేగాలకు మంచి ఉపశమనంగా మారుతుందట.
3. కేరింగ్ ఎక్కువ..
ప్రేమలో ఉండే వారు తమ భాగస్వామి నుంచి ఎక్కువ కేరింగ్ కోరుకుంటారు. అంతేకాదు పొగడ్తలను, గిఫ్టుల వంటివి కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికీ థ్యాంక్స్ చెబుతుంటారు. ప్రేమలో పడిన వారిలో గ్రాటిట్యూడ్ బాగా పెరుగుతుందట. ఒకరినొకరు గౌరవించుకోవడం, మెచ్చుకోవడం చేస్తుంటారు. చేసే పని మీద ధ్యాస పెట్టకుండా నిత్యం వారి గురించే ఆలోచిస్తారు.