Health Tips: ఈ ఆహారాలలో పోషకాలు అధికం.. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఫిట్‌గా ఉంటారు..!
Health Tips: చలికాలం అనేక సీజనల్ వ్యాధులని మోసుకొస్తుంది.
Health Tips: చలికాలం అనేక సీజనల్ వ్యాధులని మోసుకొస్తుంది. ఈ పరిస్థితిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఉదయం టిఫిన్ సమయంలో కొన్ని రకాల ఆహారాలని తీసుకోవాలి. వీటిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. వీటిని తిన్న తర్వాత రోజంతా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
పెరుగు పోహా
మీరు చలికాలంలో పెరుగు పోహా తినవచ్చు. ఇందులో బెల్లం కలపాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి తినాలి. ఇది రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది. అంతేకాదు మీరు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సీజనల్ వ్యాధులు, జలుబు, ఫ్లూ నుంచి రక్షించడానికి ఇది పనిచేస్తుంది.
గుడ్డు శాండ్విచ్
గుడ్లు ప్రోటీన్‌కి అద్భుతమైన మూలం. మీరు ఉదయం అల్పాహారంలో ఎగ్ శాండ్‌విచ్ తినవచ్చు. దీనిని 5 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. వేయించిన గుడ్లు, ఉడికించిన గుడ్లు కూడా ఉపయోగించవచ్చు. బటర్ టోస్ట్ మధ్య గుడ్డు చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతిరోజు గుడ్డు తినాలి. దీనివల్ల శరీరానికి ఒక రోజుకి సరిపోయే ప్రొటీన్ లభిస్తుంది.
ఉప్మా
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వంటకాల్లో ఉప్మా ఒకటి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పచ్చి కొత్తిమీర, నిమ్మ, పచ్చిమిర్చి వాడటం వల్ల రుచిని పెంచుకోవచ్చు. దీన్ని తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు దీనిని తేలికగా తయారుచేసుకోవచ్చు.