Super Foods: ఈ ఆహారాలు తింటే ఇన్​ఫెక్షన్స్​ దరి చేరవు.. ధర కూడా తక్కువే కానీ పట్టించుకోరు..!

Super Foods:సీజన్​ మారినప్పుడల్లా వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు తరచుగా వ్యాధులబారిన పడుతుంటారు.

Update: 2024-02-28 16:00 GMT

Super Foods: ఈ ఆహారాలు తింటే ఇన్​ఫెక్షన్స్​ దరి చేరవు.. ధర కూడా తక్కువే కానీ పట్టించుకోరు..!

Super Foods: సీజన్​ మారినప్పుడల్లా వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు తరచుగా వ్యాధులబారిన పడుతుంటారు. ఇలాంటి వారు ట్యాబ్లెట్లపై ఆధారపడకుండా సూపర్​ డైట్​ని మెయింటెన్​ చేయాలి. ప్రతి సీజన్​లో లభించే కొన్ని అద్భుతమైన కూరగాయలు, పండ్లు ఉంటాయి. వాటి ప్రయోజనాలను గుర్తించి డైట్​లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. బాడీలో ఇమ్యూనిటీ పవర్​ అధికంగా ఉంటే ఏ వ్యాధి ఏమీ చేయలేదు. అందుకే ఈ రోజు అలాంటి ఐదు సూపర్​ ఫుడ్స్​ గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఆయుర్వేద మందులలో కూడా వాడుతారు. వెల్లుల్లి ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. కానీ ఇది చాలా ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ సమస్యలు తగ్గుతాయి.

పాలకూర

పాలకూర ప్రతి సీజన్​లో లభిస్తుంది. ఇది ఒక ఆకుకూర కాబట్టి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ అధికంగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. అందుకే ప్రతిరోజు ఆహారంలో పాలకూరతో చేసిన వంటకాలు ఉండాలని గుర్తుంచుకోండి. ఒకే కర్రీ రోజు తింటే ఎవరికైనా బోర్​ కొడుతుంది అందుకే దీంతో రకరకాల ఐటమ్స్​ తయారచేసుకుని తినాలి.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్లరక్తకణాల అభిృద్దికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఇమ్యూనిటీ పవర్​ను అమాంతం పెంచేస్తాయి. వీటిని నేరుగా తినవచ్చు. ఇవి చలికాలంలో మార్కెట్​లో ఎక్కువగా కనిపిస్తాయి. కొంచెం ధర ఎక్కువైనా ప్రతిరోజు తినేలా చూసుకోవాలి.

అస్పరాగస్

అస్పరాగస్ చలికాలం తరువాత దొరుకుతుంది. ఇందులో విటమిన్-ఎ, సి, కె తో పాటూ ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

బ్రోకలీ

బ్రోకలి పోషకాల పవర్ హౌస్ అని చెబుతారు. ఇందులో విటమిన్-ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇది యాంటీ ఇన్ప్లమేటరీ, రోగనిరోధకశక్తి గుణాలకు ప్రసిద్ది చెందిన సల్పోరాఫేన్ ను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చి రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. అందుకే ప్రతిరోజు డైట్​లో ఉండే విధంగా చూసుకోవాలి. 

Tags:    

Similar News