Health Tips: మొక్కజొన్న తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
Health Tips: మొక్కజొన్న తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
Health Tips: వర్షాకాలంలో మొక్కజొన్న తినడం అంటే మహాసరదా.. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే మొత్తంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ మొక్కజొన్న తినడం వల్ల బరువు తగ్గుతారని చాలామందికి తెలియదు. అయితే బరువు తగ్గడంలో మొక్కజొన్న ఎలా ఉపయోగపడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.
బరువు తగ్గడం ఎలా?
మొక్కజొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మొక్కజొన్న బరువును పెంచుతుందని సాధారణంగా అందరు అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. మొక్కజొన్న బరువ తగ్గించడంలో సహాయపడుతుంది.
మొక్కజొన్న ఎలా తినాలి?
రోజువారీ అల్పాహారంలో మొక్కజొన్న చేర్చవచ్చు. ఉడకబెట్టి లేదా కాల్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది. నూనెలో వేయించడం, నెయ్యిలో వేయించడం చేయకూడదు. మీరు రోజూ ఒక కప్పు మొక్కజొన్న తినవచ్చు. అతిగా తినడం హానికరమని గుర్తుంచుకోండి.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు
మొక్కజొన్నలో ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. మొక్కజొన్న చాలా శక్తిని అందిస్తుంది. దీని కారణంగా మళ్లీ మళ్లీ ఆకలి వేయదు.
ప్రొటీన్ సమృద్ధిగా..
మొక్కజొన్న నుంచి తగినంత పరిమాణంలో ప్రోటీన్ లభిస్తుంది. దీని కారణంగా శరీరంలో శక్తి ఉంటుంది. మొక్కజొన్నలో విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ ఇందులో మంచి పరిమాణంలో ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువును తగ్గేలా చేస్తుంది.