Health Tips: ఎండుద్రాక్షను పాలలో మరిగించి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: ఎండుద్రాక్షను పాలలో మరిగించి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Update: 2023-02-18 01:30 GMT

Health Tips: ఎండుద్రాక్షను పాలలో మరిగించి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: ఎండు ద్రాక్ష శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఐరన్, ప్రొటీన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. అయితే ఎండు ద్రాక్ష సరిగ్గా తినకపోతే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎండుద్రాక్ష తినడానికి సరైన మార్గం ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష,నీరు

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. 15 ఎండుద్రాక్షలను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నిద్రలేచి ఈ ఎండు ద్రాక్షలను తినాలి. ఈ విధంగా తినడం వల్ల రక్తహీనత నయం అవుతుంది. శరీరానికి సరిపోయే శక్తి అందుతుంది.

ఎండుద్రాక్ష, పాలు

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి శరీరంలోని బలహీనత తొలగిపోతుంది. పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరానికి విపరీతమైన శక్తి లభిస్తుంది.

ఎండుద్రాక్షను పాలలో మరిగించి తింటే శరీరానికి మేలు జరుగుతుంది. దీని కోసం 8 నుంచి 10 ఎండుద్రాక్షలను తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించాలి. ఈ పాలు చిక్కగా అయ్యాక చల్లార్చి తినాలి. రాత్రిపూట తినడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది. అందుకే నిద్రపోయే ముందు తింటే మంచిది.

ఖాళీ కడుపుతో

ఖాళీ కడుపుతో ఎండుద్రాక్షను తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయటపడుతారు. ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా తయారవుతుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినవచ్చు.

Tags:    

Similar News