Infertility Symptoms: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వంధ్యత్వ ప్రమాదం పొంచి ఉన్నట్లే.. కారణాలు తెలుసుకోండి..!
Infertility Symptoms: పెళ్లైన ప్రతిజంట తల్లిదండ్రులు కావాలని ఆరాటపడుతుంటారు. కానీ నేటి రోజుల్లో పెళ్లై ఐదారు సంవత్సరాలైనా పిల్లల్నికనలేకపోతున్నారు.
Infertility Symptoms: పెళ్లైన ప్రతిజంట తల్లిదండ్రులు కావాలని ఆరాటపడుతుంటారు. కానీ నేటి రోజుల్లో పెళ్లై ఐదారు సంవత్సరాలైనా పిల్లల్నికనలేకపోతున్నారు. దీనికి కారణం వంధ్యత్వానికి గురికావడమే. జీవనశైలిలో మార్పులు రావడం, ఆహార పద్దతులు, చెడు అలవాట్ల కారణంగా చాలామంది వంధ్యత్వానికి గురవుతున్నారు. దీంతో సంతానానికి దూరమవుతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం వివాహమైన ఒక సంవత్సరం పాటు ఒక జంట ఎటువంటి రక్షణ లేకుండా శారీరక సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఆ మహిళ గర్భం దాల్చలేకపోతే దానిని వంధ్యత్వం అంటారు.
నిజానికి పెళ్లయిన కొద్ది నెలలకే గర్భం రాకపోతే మహిళలు మానసిక ఒత్తిడికి లోనవుతారు. దీని కారణంగా వారి సంతానోత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితిలో మీరు వంధ్యత్వం, దాని లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి పెళ్లయిన రెండు, నాలుగు నెలల్లోనే ఫలితాలు రావాలన్నదే పెళ్లయిన జంటల సమస్య. ఇది సాధ్యం కానప్పుడు మహిళపై ఒత్తిడి వస్తుంది. దీంతో ఆమె మానసిక ఒత్తిడికి గురవుతుంది. దీని వల్ల సంతానలేమి సమస్య మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో దీనిని నివారించాల్సిన అవసరం ఉంది.
పురుషులు వంధ్యత్వానికి గురవుతారు.
సంతానలేమి సమస్య స్త్రీలనే కాదు పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేదు. ఈ కారణాల వల్ల చాలా మంది వంధ్యత్వానికి గురవుతున్నారు.
1. చెడు ఆహారపు అలవాట్లు
2. ఆహారంలో తగినంత పోషకాలు లేకపోవడం
3. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయకపోవడం
4. తగినంత నిద్ర పోకపోవడం
5. ఆలస్యంగా వివాహం
ఈ వ్యాధులే కారణం
ట్యూబల్ బ్లాక్, ఎండోమెట్రియోసిస్, పీసీఓడీ, హైడ్రోసల్పినిక్ వ్యాధుల కారణంగా మహిళలు సంతానలేమికి గురవుతారు. పురుషులలో, తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి, జీరో స్పెర్మ్, స్పెర్మ్ ఆకృతిలో భంగం కారణంగా సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. అయితే ఈ సమస్యలకు ట్రీట్‌మెంట్ తీసుకొని మళ్లీ గర్భదారణకు ప్రయత్నించవచ్చు. నేటికాలంలో చాలామంది ఇందులో విజయం సాధించారు.