Vitamin D: ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే విటమిన్‌ డి లోపం.. విస్మరిస్తే అంతే సంగతులు..!

Vitamin D: ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే విటమిన్‌ డి లోపం.. విస్మరిస్తే అంతే సంగతులు..!

Update: 2023-02-20 01:30 GMT

Vitamin D: ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే విటమిన్‌ డి లోపం.. విస్మరిస్తే అంతే సంగతులు..!

Vitamin D: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా విటమిన్ డి ఎముకలు, దంతాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరానికి సూర్యరశ్మిని తాకినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా ఇది లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపం లక్షణాలని అస్సలు విస్మరించకూడదు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. విటమిన్ డి లోపించడం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు తెలుసుకుందాం.

గాయం మానకపోవడం

శరీరంలో గాయం ఏర్పడి అది నయం కాకపోతే అది విటమిన్ డి లోపం లక్షణం. విటమిన్ డి గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. గాయం నయం కాకపోతే శరీరంలో విటమిన్ డి లోపం ఉందని అర్థంచేసుకోవాలి. ప్రతిరోజూ 15 నిమిషాలు ఎండలో కూర్చుంటే విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.

డిప్రెషన్

మీరు కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నట్లయితే అది విటమిన్ డి లోపం వల్ల జరిగిందని అర్థం చేసుకోండి. విటమిన్ డి లేకపోవడం వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది మీకు అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది.

అలసటగా అనిపించడం

మీరు పదే పదే అలసిపోయినట్లు అనిపిస్తే అది విటమిన్ డి లోపానికి సంకేతం. విటమిన్ డి లోపం వల్ల ఎనర్జీ లెవెల్ తగ్గుతాయి. మరోవైపు విటమిన్ డి లోపం అలసట, తలనొప్పి, నిద్ర లేకపోవడం, నిరంతర ఎముక నొప్పి వంటి సమస్యలని కలిగిస్తుంది.

బలహీనమైన రోగనిరోధక శక్తి

విటమిన్ డి మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే లేదా జలుబు లేదా ఫ్లూ కలిగి ఉంటే విటమిన్ డి లోపం ఒక లక్షణం కావచ్చు. ప్రతి కాలానుగుణ మార్పు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

Tags:    

Similar News