Liver Disease: చర్మంపై ఈ భాగంలో దురదగా ఉంటుందా.. మీ లివర్ డేంజర్‌లో ఉన్నట్లే..!
Liver Disease: లివర్ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. బాడీలో జరిగే అన్ని పనులలో దీని సహకారం ఉంటుంది.
Liver Disease: లివర్ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. బాడీలో జరిగే అన్ని పనులలో దీని సహకారం ఉంటుంది. ఇది శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. కానీ డ్యామేజ్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఆలస్యంగా తెలియడం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆల్కహాల్ తాగేవారిలో లివర్ వ్యాధులు ఎక్కువగా వస్తాయనడంలో సందేహం లేదు. కానీ వైరల్ ఇన్ఫెక్షన్, ఊబకాయం, జన్యు కారణాల వల్ల కూడా లివర్ సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి సందర్భంలో వాటిని ముందుగా గుర్తించడం అవసరం. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
అలసట, బలహీనత
నిరంతర అలసట, బలహీనత కాలేయ వ్యాధికి ప్రారంభ సంకేతాలు. ఇలాంటి సందర్భంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. పొట్ట పైభాగంలో నొప్పి లివర్ వాపునకు సంకేతం. ఈ నొప్పి తేలికపాటి నుంచి తీవ్రంగా మారుతుంది. కొవ్వు పదార్ధాలు తిన్న తర్వాత మరింత పెరుగుతుంది. లివర్ సమస్యల వల్ల మూత్రం రంగు మారుతుంది. ఈ స్థితిలో మూత్రం రంగు టీ రంగు లేదా గోధుమ రంగులోకి మారుతుంది.
మలం రంగులో మార్పు
మలం మట్టి రంగులో మారితే లివర్ పనిచేయడంలేదని అర్థం. సిర్రోసిస్ వంటి వ్యాధులలో లివర్ వాపునకు గురవుతుంది. ఇది పొట్ట విస్తరణగా కారణమవుతుంది. పాదాలు, చీలమండల వాపు కూడా సంభవిస్తుంది. లివర్ వ్యాధి ఉన్న రోగులకు చర్మం కింద పిత్త లవణాలు పేరుకుపోవడం వల్ల నిరంతర దురద ఉంటుంది. ఈ దురద ఎక్కడైనా రావచ్చు కానీ అరచేతులు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి లివర్ టెస్ట్ చేయించుకోవాలి.