Health Tips: అత్తిపండ్లు తింటే వీరికి అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Health Tips: అత్తిపండ్లు తింటే వీరికి అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో పురుషుల బాధ్యతలు మునుపటి కంటే ఎక్కువగా పెరిగాయి. దీని కారణంగా వారు సొంత ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. లేదంటే దీర్ఘకాలిక వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంటుంది. పురుషులు ప్రతిరోజూ అత్తి పండ్లను తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
మలబద్ధకం నుంచి ఉపశమనం
అత్తిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని నిత్యం తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా అంజీర్ పండ్లను తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రేగు కదలికలలో సమస్యలను తొలగిస్తుంది.
బరువు తగ్గిస్తుంది
అత్తిపండులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని ప్రతిరోజు తినడం వల్ల ఎక్కువ కాలం ఆకలి ఉండదు కాబట్టి తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.
గుండె జబ్బుల నివారణ
భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో పురుషులు కూడా ఉన్నారు. పురుషులు తరచుగా ఇంటి బయటే ఉంటారు ఎక్కువ నూనెతో కూడిన ఆహారాన్ని తింటారు. ఈ సందర్భంలో అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అంజీర్ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
అత్తి పండ్లను ఇలా తినండి
అత్తి పండ్లను తినడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దీన్ని పచ్చిగా, ఉడికించి తినవచ్చు. ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ లాగా కూడా తినవచ్చు. పురుషులు ఈ పండు ద్వారా గరిష్ట ప్రయోజనం పొందాలనుకుంటే రాత్రిపూట నానబెట్టి ఉదయం నిద్రలేచి ఖాళీ కడుపుతో తినవచ్చు. కొందరు రాత్రి పడుకునే ముందు పాలలో కలుపుకుని తాగుతుంటారు.