Autism Symptoms: పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించండి.. లేదంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు..!

Autism Symptoms: నేటి కాలంలో పిల్లలు పుట్టేవరకు ఒక ఎత్తైతే వారి పెంచడం మరో ఎత్తు.

Update: 2024-04-04 15:00 GMT

Autism Symptoms: పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించండి.. లేదంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు..!

Autism Symptoms: నేటి కాలంలో పిల్లలు పుట్టేవరకు ఒక ఎత్తైతే వారి పెంచడం మరో ఎత్తు. చిన్నవయసులో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోకుంటే పెరిగిన తర్వాత వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రులుగా మనం ఆ తప్పు ఎప్పుడూ చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఆటిజానికి గురవుతున్నారు. దీనికి కారణం సకాలంలో ఆ లక్షణాల ను గుర్తించకపోవడం. నిజానికి పిల్లల కోసం కొంచెం టైం కేటాయించాలి. లేదంటే వారు మానసి క సమస్యలకు గురవుతారు. ఈ రోజు ఆటిజం లక్షణాలు, చికిత్స విధానం గురించి తెలుసు కుందాం.

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏమిటి?

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (ASD) అనేది సాధారణంగా బాల్యంలో అభివృద్ధి చెందే న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్‌ల సమూహం. ఇది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. సామాజి క పరస్పర చర్య, కమ్యూనికేషన్, నాన్-వెర్బల్ కమ్యూనికేషన్‌లో ఇబ్బందులను కలిగిస్తుంది. ఆటిజంతో ఉన్న ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటారు. కాబట్టి లక్షణాల తీవ్రత, రకం అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది.

ఆటిజం లక్షణాలు

- కొన్ని పదాలను పదే పదే మాట్లాడటం

- నాన్-వెర్బల్ కమ్యూనికేషన్‌లో ఇబ్బంది

- కంటిచూపుతో మాట్లాడలేకపోవడం, సరిగ్గా చూడలేకపోవడం

- ఇతర పిల్లలతో కలవకపోవడం, వారి నుంచి దూరంగా ఉండడం

ఆటిజంపై అవగాహన ఎందుకు ముఖ్యం?

మన సమాజంలో ఆటిజం గురించి ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. అవగాహన పెంచుకోవ డం వల్ల ఈ అపోహలు తొలగిపోతాయి. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల పట్ల సానుభూతిని ప్రోత్సహిస్తుంది. చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల పట్ల దయతో ఉండండి. సోషల్ మీడియాలో ఆటిజం అవగాహన గురించి పోస్ట్ చేయండి. సంఘంలోని ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులను వారి కుటుంబాలను ప్రేమించండి.

Tags:    

Similar News